ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చర్లపల్లి టెర్మినల్ (Cherlapally Railway Terminal) ప్రారంభ తేదీ ఫిక్స్ (Opening Date) అయ్యింది. డిసెంబర్ 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరియు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Railway Minister Ashwini Vaishnav and Union Minister Kishan Reddy)లు కలిసి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ టెర్మినల్ అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, అలాగే ప్రత్యేకంగా మహిళలు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్ ఇలా ఎన్నో ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు విస్తృత సౌకర్యాలు :
టెర్మినల్‌లో హై క్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌తో పాటు మొదటి అంతస్తులో కెఫ్ టేరియా, రెస్టారెంట్, మరియు రెస్ట్ రూమ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ టెర్మినల్ ప్రయాణికులకు సుళువైన సేవలను అందించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపింది.
సికింద్రాబాద్, కాచిగూడ ఒత్తిడి తగ్గింపు :
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని తగ్గించడానికి చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ టెర్మినల్ ప్రారంభం తరువాత వివిధ ప్రాంతాలకు రాకపోకలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి.
25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు టెర్మినల్ నుంచి :
దక్షిణ మధ్య రైల్వే ఈ టెర్మినల్ నుంచి దాదాపు 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వే బోర్డు ఈ మేరకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా చర్లపల్లి టెర్మినల్‌లో అన్‌లోడ్ చేసుకునే సదుపాయాలను కల్పించింది. ఇది కార్గో రవాణాకు కూడా ప్రధాన కేంద్రంగా మారనుంది.
ప్రయాణికులకు మెరుగైన అనుభవం :
టెర్మినల్ ప్రారంభం ద్వారా ప్రయాణికులకు వేచి చూసే సమయం తగ్గడంతో పాటు అధిక సౌకర్యాలు లభించనున్నాయి. ఈ టెర్మినల్ హైదరాబాద్ రైల్వే నెట్‌వర్క్‌లో ముఖ్యమైన భాగంగా మారనుంది. రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆనందకరమని ప్రయాణికులు భావిస్తున్నారు.
Read Also : Virat Kohli: అశ్విన్ రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లి భావోద్వేగం!
