Chennamaneni Ramesh : వేములవాడకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు జర్మన్ పాస్‌పోర్టు ఉందని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర హోం శాఖ నివేదించింది. పాస్ పోర్టును 2033 వరకు ఆయన రెన్యూవల్ చేసుకున్నారని.. గత ఏడాది ఇదే పాస్‌పోర్టుతో జర్మనీకి మూడుసార్లు వెళ్లొచ్చారని వెల్లడించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం చెన్నమనేని విదేశీ ప్రయాణాల వివరాలను అందించాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. జర్మనీ పాస్‌పోర్టు మీద ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం తనకు ఉన్నట్టు కాదని జర్మనీ ఎంబసీ చెప్పిన విషయాన్ని చెన్నమనేని ప్రస్తావించారు. పౌరసత్వ చట్టం ప్రకారం విచారించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ వ్యవహరించిందని ఆయన(Chennamaneni Ramesh) ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో.. తాను జర్మనీ పౌరసత్వాన్ని వెనక్కి ఇచ్చేశానని చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఆయన దాఖలు చేసిన కౌంటర్ పిటిషనుపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దనీ, తుది వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది. కాగా, చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం(భారత్ తోపాటు జర్మనీ) కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: CBN-YS Sharmila : చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే ..?
ప్రపంచంలోనే 2024కిగానూ ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శక్తిమంతమైనవిగా నిలిచాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. మంగళవారం విడుదలైన ‘హెన్లీ పాస్‌పోర్టు సూచీ’ నివేదికలో ఇవి తొలి స్థానంలో నిలిచాయి. 227 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానం దక్కించుకొంది. తొలి స్థానంలో నిలిచిన ఆరు దేశాల పాస్‌పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. గత ఐదేళ్లుగా ఈ సూచీలో సింగపూర్, జపాన్ తొలిస్థానంలో నిలుస్తున్నాయి. ఈసారి అదనంగా మరో నాలుగు దేశాలు వాటి సరసన చేరాయి. రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాల పాస్ట్‌పోర్టులతో 193 దేశాలకు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో 192 దేశాలకు వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరంలేదు. 191 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉన్న యూకే పాస్‌పోర్టు నాలుగో స్థానం దక్కించుకుంది.