Site icon HashtagU Telugu

Luxury Watch Smuggling: పొంగులేటికి బిగ్ షాక్.. స్మగ్లింగ్‌ కేసులో కొడుకుకి సమన్లు

Luxury Watch Smuggling

Luxury Watch Smuggling

Luxury Watch Smuggling: కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు ​​జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు హాజరుకావాలని కోరగా.. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్నానని కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడట. వైద్య సలహా మేరకు ఏప్రిల్ 27 తర్వాత కస్టమ్స్ అధికారుల ముందు హాజరుకావడానికి అంగీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్ష రెడ్డి చెప్తున్నాడు. ఇది పూర్తిగా నిరాధారమైనదని పేర్కొన్నాడు. నేను ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నానని తెలంగాణ ఆర్థిక, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు తెలిపారు. మార్చి 28న హైదరాబాద్‌లోని హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ కార్యాలయానికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు ​​పంపారు.

సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన హాంకాంగ్‌కు చెందిన భారతీయుడు ముహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ నుంచి రెండు లగ్జరీ వాచ్‌లు చెన్నై కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గడియారాల అసలు విలువ రూ. 1.73 కోట్లుగా కస్టమ్స్ అంచనా వేసింది. పాటెక్ ఫిలిప్‌ గడియారాలు భారతదేశంలో డీలర్ లేదని తెలుస్తుంది. కస్టమ్స్ దర్యాప్తు ప్రకారం నవీన్ కుమార్, హర్ష మరియు ముబీన్ అనే లగ్జరీ వాచ్ డీలర్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించాడని కస్టమ్స్ పేర్కొంది. మరియు లావాదేవీల చెల్లింపులను సులభతరం చేసినట్లు వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ మరియు నగదు, హవాలా మార్గాన్ని ఉపయోగించినట్లు కస్టమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.

We’re now on WhatsAppClick to Join

అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని హర్ష రెడ్డి ఖండించారు. ఈ విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపాడు. అయితే, వైద్య సలహా మేరకు ఏప్రిల్ 27 తర్వాత డిపార్ట్‌మెంట్ ముందు హాజరుకావడానికి అంగీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అటు నవీన్ కుమార్ ముందస్తు బెయిల్ దరఖాస్తును కొట్టివేస్తూ, మద్రాస్ హైకోర్టు మార్చి 18న ఇచ్చిన తీర్పులో డేటాను పరిశీలిస్తే విలాసవంతమైన గడియారాల మొత్తం స్మగ్లింగ్‌లో మొత్తం రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని పేర్కొంది. అలందూరు కోర్టు ఈ కేసును పరిశీలించిన సందర్భంగా ఏప్రిల్ 1న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హర్ష రెడ్డిని విచారించి ఆలోకం నవీన్ కుమార్‌ను అరెస్టు చేయాలని కస్టమ్స్‌ను ఆదేశించినట్లు కస్టమ్స్ వర్గాలు తెలిపాయి.

Also Read: Election In Extreme Heat: ఎలక్షన్ ‘హీట్’: ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఎన్నికల సమరం..!