Site icon HashtagU Telugu

Cheguvera Daughter: హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

cheguvera

Resizeimagesize (1280 X 720) (1)

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు క్యూబాకు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగానే క్యూబాకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సభకు చేగువేరా కూతురు, మనవరాలు వచ్చారు. వీరికి నాయకులు ఘనస్వాగతం పలికారు. క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొంటారు.

Also Read: Terrorist Gurupatwant Singh: ఢిల్లీనే మా టార్గెట్.. ఉగ్రదాడి చేస్తాం: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను

హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌కు వెళ్లనున్నారు. వీరి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ జరిగే రవీంద్రభారతి వద్ద పలుచోట్ల ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.