Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు

సన్‌బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు

Published By: HashtagU Telugu Desk
Sunburn

Sunburn

Sunburn Event: సన్‌బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. అయితే ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అతనిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతి లేకపోయినా, బుక్ మై షోలో సుశాంత్ సన్‌బర్న్ పేరుతో టిక్కెట్లు విక్రయించాడు. అసలు ఈవెంట్ లేకుండానే సుశాంత్ బుక్ మై షోలో టిక్కెట్లు నిర్వహిస్తున్నాడు. దీంతో మాదాపూర్ పోలీసులు సుశాంత్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు.ఏ కార్యక్రమం నిర్వహించకుండా డబ్బులు వసూలు చేసి సుశాంత్ మోసం చేశాడని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత సీన్ మారిపోయింది. న్యూ ఇయర్ ముసుగులో జరుగుతున్న కార్యక్రమాలపై నిఘా పెట్టాలని రేవంత్ ఆదేశాలతో అధికార యంత్రాంగం స్పీడ్ పెంచింది. నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సన్‌బర్న్, బుక్‌మైషో వంటి టిక్కెట్లు విక్రయించే, ఈవెంట్‌లు నిర్వహించే సంస్థలకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సీపీ మహంతి తెలిపారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల పేరుతో జరుగుతున్న జల్సాలకు ఎలా చెక్ పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈసారి మాటలే కాదు చేతలు కూడా బలపడతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Also Read: Apple iPhone 15 Discount : యాపిల్ ఐఫోన్ 15 పై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి?

  Last Updated: 27 Dec 2023, 06:37 PM IST