Site icon HashtagU Telugu

Rainfall in Hyderabad: చార్మినార్‌లో అత్యధికంగా 79 మిమీ వర్షపాతం నమోదు

Rainfall in Hyderabad

New Web Story Copy (32)

Rainfall in Hyderabad: సోమవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. తేలికపాటి వర్షానికే నగరం స్థంబించిపోతుంది. అలాంటిది గత రాత్రి కుండపోత వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తెలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు ప్రమాద అంచుకు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో నగరవాసలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో గత 24 గంటల్లో చార్మినార్‌లో అత్యధికంగా 79 మిమీ వర్షపాతం నమోదైంది.

చార్మినార్ 79 మి.మీ వర్షపాతం నమోదైంది.
అంబర్‌పేట్ 71.5 వర్షపాతం నమోదైంది.
గోల్కొండ 71 వర్షపాతం నమోదైంది.
బహదూర్‌పురా 69.3 వర్షపాతం నమోదైంది.
సైదాబాద్ 69.3 వర్షపాతం నమోదైంది.
బండ్లగూడ 67 వర్షపాతం నమోదైంది.
ఆసిఫ్‌నగర్ 65.3 వర్షపాతం నమోదైంది.
సికింద్రాబాద్ 65 మి.మీ
షేక్‌పేట 64.8 మి.మీ
నాంపల్లి 64.3 మి.మీ
ఖైరతాబాద్ 63.8 మి.మీ
హిమాయత్‌నగర్ 62.3మి.మీ
మారేడ్‌పల్లి 55.8 మి.మీ
ముషీరాబాద్ 54.3 మి.మీ
అమీర్‌పేట 52.5 మి.మీ

ఇదిలా ఉండగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Also Read: BRS Politics: కోమటిరెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన యాదాద్రి ముఖ్యనేత