తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజు కోట్ల నష్టం ఆర్టీసీ కి వాటిల్లుతుంది. ఇక త్వరలో మేడారం మహాజాతర (Medaram) మొదలుకాబోతుంది. మరి అప్పుడెలా అనేది ఆలోచనలో పడింది. మాములుగా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసి చార్జీలు పెంచుతుంటారు. దీనివల్ల ఆర్టీసీ కి కాస్త లాభాలు వస్తుంటాయి. మరి ఇప్పుడు ఫ్రీ సౌకర్యం ఉండడం తో లాభాలు కాదు ఇంకా కోట్లలలో నష్టం వాటిల్లడం ఖాయం..అందుకే సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు వినికిడి.
We’re now on WhatsApp. Click to Join.
జనవరిలో సం క్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు సమాచారం. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం రూ.11 కోట్ల నుంచి రూ. 18 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగినా, ఆదాయం భారీగా పడిపోయింది. రోజు సంస్థ ఆదాయం రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్లకు పడిపోయింది.
ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రీయింబర్స్‌మెంట్ చెల్లించే వరకూ ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది. ఈ క్రమంలో సమక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. పల్లెవెలుగు, ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తిస్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఆదేశించినట్టు సమాచారం.
Read Also : Priyanka Arul Mohan : విలన్ తో పవన్ హీరోయిన్ స్టెప్పులు..!