TSRTC to TGSRTC: త్వరలోనే టీఎస్‌ఆర్టీసీని టీజీఎస్‌ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఆర్టీసీ(RTC) అధికారులు ప్రకటించారు. అతి త్వరలోనే లోగోలో(logo) మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమయంలో టీజీని తెలంగాణవాదులు, ప్రజలు ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది.
Read Also: KTR : మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..
రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.