Nursing Officers : నర్సింగ్ సిబ్బంది గౌరవాన్ని మరింత పెంచేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతో పాటు ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోని హాస్పిటల్ లలో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టును యథాతథంగా ఉంచింది. నర్సులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నర్సుల గౌరవాన్ని పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరించామని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు. తమ హోదాను ఉన్నతీకరించినందుకు నర్సులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని తమ కష్టానికి తగ్గ ఫలితంగా భావిస్తున్నామని (Nursing Officers) పేర్కొన్నారు.
Also read : Kushboo Support to Roja : మంత్రి రోజా కు సపోర్ట్ గా నిలిచిన సీనియర్ నటి