బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో “తాను తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు” అనే మాటలను హాస్యాస్పదంగా అభివర్ణించారు. చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణకు సంబంధించిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డుపడ్డారంటూ కవిత ఆరోపించారు. ప్రత్యేకంగా గోదావరి జలాల వినియోగంలో ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు న్యాయం జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Fish Prasadam : జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. మృగశిర కార్తె రోజే తినాలా ?
తాజాగా ప్రజాభవన్‌లో జరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు తీరని నష్టం జరగవచ్చని ఆమె హెచ్చరించారు. గతంలో చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకున్నా ఇప్పుడు మాత్రం ‘తాను వ్యతిరేకించలేద’ని చెప్పడం నవ్వొస్తుందని కవిత పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా నీటిపారుదల శాఖపై దృష్టి పెట్టాలని కవిత సూచించారు. ఈ క్రమంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ తరఫున ఆలోచిస్తున్నామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై ఉన్న అసమానతలు త్వరగా పరిష్కారానికి రావాలని కోరారు. చంద్రబాబు – రేవంత్ భేటీ తర్వాత సాగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రయోజనాలకు భంగంగా మారకూడదని ఆమె హెచ్చరించారు.