Telangana TDP: చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్,  తెలంగాణ అసెంబ్లీ బరి నుంచి టీడీపీ ఔట్!

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తేల్చేశారు నారా లోకేశ్.

  • Written By:
  • Updated On - October 24, 2023 / 03:44 PM IST

Telangana TDP: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఖమ్మం వేదికగా  గతంలో నిర్వహించిన సభ ఊహించనివిధంగా సక్సెస్ అయ్యింది. నేషనల్ మీడియా సైతం బాబు సభలపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ గట్టి పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా జోష్ తగ్గింది. ఈ నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తేల్చేశారు. ఆ పార్టీ హోదాలో పోటీ చేయట్లేదని అధికారికంగా ధృవీకరించారు లోకేష్

హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లను టీడీపీ ప్రభావితం చేయగలదు అంతా భావించారు. కానీ లోకేష్ మాత్రం పోటీ మావల్ల కాదు అని తేల్చేయడం విశేషం. టీడీపీ నిర్ణయం కారణంగా పార్టీ ఓట్లు కాంగ్రెస్ కి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. కానీ బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు విషయంలో సింపతీని చూపించారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు కూడా టీడీపీ వాళ్లకి ఊరడింపు నిచ్చాయి. ఇక ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో అభ్యర్థుల్ని నిలబెడుతోంది. దీంతో జనసేనకు టీడీపీ ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న టీడీపీ పార్టీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు.

Also Read: Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అసలు వయసు ఎంతో తెలుసా