Site icon HashtagU Telugu

TDP Meeting In Khammam: నేడు ఖమ్మంలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

Krishna District

chandrababu naidu

ఖమ్మం గుమ్మంలో టీడీపీ (TDP) శంఖారావం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP) పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్న టీడీపీ.. లక్ష మందిని తరలించేందుకు ప్లాన్ చేస్తోంది.

చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ఉదయం బయల్దేరి రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతర రాజకీయాలతో కోలుకోలేని దెబ్బతింది. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు.. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read: YS Sharmila: పాలేరు బరిలో షర్మిల.. ప్రధాన కారాణాలివే!

పార్టీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో జయప్రదం చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. టీడీపీ జెండాలు, ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో ఖమ్మం నగరం పసుపుమయమైంది. బహిరంగ సభకు రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నారు. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో మహిళలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు చీర కట్టుకుని సభలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.