Site icon HashtagU Telugu

Telangana TDP: తెలంగాణ టీడీపీ బస్సు యాత్రలో చంద్రబాబు

Telangana TDP

New Web Story Copy 2023 08 13t171238.590

Telangana TDP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. రెండు తెలుగు రాష్ట్రాలను విభజించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఎన్నికయ్యారు. తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజుల్లో తెలంగాణాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణ గడ్డపై టీడీపీ ఉనికి చాటింది. అయితే చంద్రబాబు ఏపీపై పూర్తిగా దృష్టి సారించడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. దీంతో తెలంగాణాలో టిడిపి ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్బై చెప్పారు. మొత్తానికి తెలంగాణాలో టీడీపీ ఆనవాళ్లు కూడా కరువయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని భావిస్తుంది.

తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ప్రజల్లో తమ ఉనికి చాటేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార పార్టీ మరోసారి అధికారం దక్కించుకునే పనిలో పడింది. ఇప్పటినుంచే ప్రచారంతో సమాయత్తం అవుతున్నాయి. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుంది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యత్ర ప్రారంభించనుంది. ఈ బస్సు యాత్రలో చంద్రబాబు కూడా పాల్గొంటారని తెలిపారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రను అక్కడినుంచే మొదలుపెడతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని కాసాని పేర్కొన్నారు. ఆ తరువాత జిల్లాల వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.

Also Read: Vijay Sales: విజయ్ మెగా సేల్స్.. యాపిల్ లవర్స్ త్వరపడండి