Site icon HashtagU Telugu

Chandrababu: బీజేపీ హైకమాండ్ తో నాయుడు భేటీ

Chandrababu

04 06 2023 Tdp Chief Naidu Meet Shah Nadda 23431849

Chandrababu: ఏపీలో టీడీపీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారు. ఈ క్రమంలో టీడీపీ కేవలం 21 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మరోవైపు జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. దీంతో వచ్చే ఎన్నికలపై టీడీపీ జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ రెండు వైపుల ఉండటంతో రాజకీయ సమీకరణాలు కుదరలేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాబు, కేంద్రంతో దోస్తీకి లైన్ క్లియర్ చేశాడు. అయితే ఈ భేటీ కేవలం తెలంగాణ రాజకీయాలపైన మాత్రమేనని తెలుస్తుంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తుపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది.

ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో టీడీపీ ఎన్డీఏలో భాగమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో 2019 ఎన్నికలకు ముందు 2018 మార్చిలో అధికార కూటమి నుంచి వైదొలిగింది. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. ఇదిలా ఉండగా ఇటీవల పిఎం మోడీ మన్ కీ బాత్‌ రేడియో ప్రోగ్రామ్లో టిడిపి వ్యవస్థాపకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుని నివాళులర్పించారు. దీంతో బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య రాజకీయ సంధి కుదిరిందనే చర్చ మొదలైంది.

Read More: Ben Stokes: టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బెన్ స్టోక్స్..!