Chandrababu Naidu : మొన్న కేంద్రంతో మీటింగ్.. నేడు తెలంగాణ నాయకులతో మీటింగ్.. బాబు ఏం ప్లాన్ చేస్తున్నారు?

ఇక చంద్రబాబు కూడా ఎలాగైనా ఈ సారి ఏపీలో అధికారం రావాలి అని అనుకుంటూనే తెలంగాణలో కూడా కొన్ని సీట్స్ అయినా సంపాదించాలి అని చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 08:35 PM IST

ఎలక్షన్స్(Elections) దగ్గరకు వస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇక తెలంగాణలో అయితే రాజకీయం రోజుకో ముఖ చిత్రం మారుతుంది. కర్ణాటక(Karnataka) ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ(Telangana)లో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్(Congress) లో జోష్ వచ్చింది. BRS, BJP లకు భయం పట్టుకుంది. ఇక BJP కి అయితే అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని వాళ్లకు కూడా అర్థమై కనీసం MP సీట్లు, ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకోవాలని ట్రై చేస్తుంది.

ఇక చంద్రబాబు కూడా ఎలాగైనా ఈ సారి ఏపీలో అధికారం రావాలి అని అనుకుంటూనే తెలంగాణలో కూడా కొన్ని సీట్స్ అయినా సంపాదించాలి అని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, JP నడ్డా, మరికొంతమంది కేంద్ర పెద్దలతో మీట్ అయ్యారు. ఈ మీటింగ్ లో ఏపీ, తెలంగాణాలో పొత్తుల గురించే ముఖ్యంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ మీటింగ్ జరిగిన రెండు రోజులకే నేడు తెలంగాణ నాయకులతో చంద్రబాబు మీటింగ్ పెట్టారు.

చాలా రోజుల తర్వాత నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబుకు తెలంగాణ TDP నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మరికొంతమంది చంద్రబాబుని సన్మానించారు. అనంతరం చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీంతో చంద్రబాబు మీటింగ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. చంద్రబాబు ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహాలు ఈ సారి తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీలను దెబ్బతీస్తాయో చూడాలి.

 

Also Read : TDP – BJP Alliance : టీడీపీతో క‌లిస్తే బీజేపీకి లాభ‌మా? ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. మోదీ, షా వ్యూహం అదుర్స్‌?