Site icon HashtagU Telugu

Khammam : చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ ! తెలంగాణలో ప్ర‌కంప‌న‌లు!

AP Skill

Khamma Babu

తెలంగాణ రాజ‌కీయాల‌ను ఖ‌మ్మం స‌భ ద్వారా టీడీపీ(TDP) జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు శాసించ‌బోతున్నారు. అక్క‌డ బుధ‌వారం జ‌రిగే స‌భ‌, ర్యాలీల‌కు వ‌చ్చే స్పంద‌న ఆధారంగా ఈక్వేష‌న్లు మార‌డానికి అవ‌కాశం ఉంది. పూర్వ‌ వైభ‌వం కోసం ప‌రిత‌పిస్తోన్న శ్రేణుల‌కు దిశానిర్దేశం ఆ స‌భ నుంచి చంద్ర‌బాబు ఇవ్వ‌నున్నారు. ఖ‌మ్మం(Khammam) జిల్లా వ్యాప్తంగా స్ట్రాంగ్ హోల్డ్ టీడీపి(TDP)కి ఉంది. అందుకే, అక్క‌డ నుంచే చంద్ర‌బాబు ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌నున్నారు. హైద‌రాబాద్ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు భారీ ర్యాలీకి తెలంగాణ టీడీపీ(TTDP) సిద్దం అయింది. దారిపొడ‌వునా చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికే ఏర్పాట్ల‌ను చేశారు. పూర్వం మాదిరిగా అడుగ‌డుగునా చంద్ర‌బాబుకు నీరాజ‌నాలు ప‌ల‌క‌డానికి తెలంగాణ టీడీపీ(TTDP) క్యాడ‌ర్ సిద్ధం అయింది. దాదాపు ఎనిమిదేళ్ల త‌రువాత బ‌ల‌నిరూప‌ణ‌కు టీడీపీ దిగుతోంది.

ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉద‌యం 9.30 గంటలకు బ‌య‌లుదేరి రసూల్‌పుర లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్ర‌బాబు నివాళుల‌ర్పిస్తారు. అక్క‌డ‌ నుంచి హబ్సిగూడ, ఉప్పల్, ఎల్‌బినగర్, హయత్ నగర్ ల మీదరుగా టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మూడు గంటలకు ఖమ్మం(Khammam) చేరుకుని మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం అక్క‌డ నుంచి రోడ్డుమార్గాన విజయవాడ ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇలా షెడ్యూల్ ను ఖ‌రారు చేసిన టీడీపీ రాబోవు రోజుల్లో మ‌రికొన్ని ప్రాంతాల్లో చంద్ర‌బాబుతో బ‌హిరంగ స‌భ‌ల‌ను పెట్ట‌డానికి ప్లాన్ చేస్తోంది.

ఖ‌మ్మం(Khammam) స‌భ సూప‌ర్ హిట్

ఇటీవ‌ల చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లిన‌ప్ప‌టికీ జ‌నం పెద్ద ఎత్తున హాజ‌ర‌వుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌త్యేకించి ఖ‌మ్మం ప్రజానీకం ఆయ‌న కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల భ‌ద్రాచ‌లం ముంపు సంభ‌వించిన‌ప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండ‌గా నిర్మించిన క‌ర‌క‌ట్ట‌ను గుర్తు చేసుకున్నారు. ఆ క‌ట్ట‌లేక‌పోతే, భ‌ద్రాచ‌లం టోట‌ల్ గా మునిగిపోయి ఉండేద‌ని ఆయ‌న ముందుచూపును ముంపు సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. తెలంగాణ‌కు ఆయ‌న చేసిన నిస్వార్థ సేవ‌ల ఫ‌లాల‌ను జ‌నం అందుకుంటున్నారు. అంతేకాదు, బీసీలు తెలుగుదేశం పార్టీని నిల‌బెట్టుకోవాల‌న్న క‌సితో ఉన్నారు. వెర‌సి చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్ కానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక అక్క‌డి నుంచి తెలంగాణ రాజ‌కీయాలు పూర్తిగా మారే ఛాన్స్ ఉంది.

టీఆర్ఎస్ ను మూసివేసిన క్ర‌మంలో

తెలుగుదేశం లీడ‌ర్లు, ఓట‌ర్ల‌తో ఇంత‌కాలం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ న‌డిపారు. ఆ పార్టీలోని లీడ‌ర్లు 90శాతం పూర్వపు టీడీపీ నాయ‌కులే. ఇక ఓట‌ర్లు కూడా తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపిన వాళ్లే ఎక్కువ ఉంటార‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ను మూసివేసిన క్ర‌మంలో తిరిగి లీడ‌ర్లు, ఓట‌ర్లు టీడీపీ వైపు మొగ్గుచూపుతార‌ని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ లీడ‌ర్లు, క్యాడ‌ర్ కొంత మేర వెళ్లింది. ఖ‌మ్మంలో చంద్ర‌బాబు స‌భ హిట్ అయితే కాంగ్రెస్ లోకి వెళ్లిన లీడ‌ర్లు, క్యాడ‌ర్ తిరిగి టీడీపీకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఫ‌లితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏకాకిగా మిగిలిపోతార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని భావ‌న‌. కాంగ్రెస్ పార్టీని ఖ‌తం చేయాల‌ని బీజేపీ చూస్తోంది. అదే స‌మ‌యంలో కేసీఆర్ అంతుచూడాల‌ని క‌మ‌ల‌నాథులు క‌సిగా ఉన్నారు. ఇలాంటి పరిణామాల‌ను చంద్ర‌బాబు అనుకూలంగా మార్చుకోవాల‌ని చూస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఆ పార్టీలో ఉన్న నామా, తుమ్మ‌ల‌, పొంగులేటి, పువ్వాడ మ‌ధ్య పొస‌గ‌డంలేదు. కొంత కాలంగా తమ్మల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూరంగా ఉంటున్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్, ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ చురుగ్గా క‌నిపించ‌డంలేదు. ఖ‌మ్మంలో చంద్ర‌బాబు స‌భ త‌రువాత తుమ్మ‌ల తిరిగి టీడీపీకి వ‌స్తార‌ని తెలుస్తోంది. అలాగే, పొంగులేటి బీజేపీ లేదా వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి వెళతార‌ని టాక్‌. ఇక నామా నాగేశ్వ‌ర‌రావు మీద బీజేపీ ఆప‌రేష‌న్ చేస్తోంద‌ని వినికిడి. ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల క్ర‌మంలో పువ్వాడ తిరిగి కామ్రేడ్ గా అవ‌తారం ఎత్తుతార‌ని తెలుస్తోంది. మొత్తం మీద చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌ల‌ను రేపుతోంది.

Also Read : TTDP : తెలంగాణ‌పై చంద్ర‌బాబు దూకుడు!ఖ‌మ్మంలో ఎన్నికల శంఖారావం