Harish Rao: 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు, ప్రత్యేక హైకోర్టు ఇలా పాలన కొనసాగుతుంది. అయితే గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి విబేధాలు ఎదురవ్వలేదు. నీటి పంపకాలు, రాజధాని ఇష్యు మినహా ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. త్వరలో రాష్ట్రం లోకసభ ఎన్నికలకు సిద్దమవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోకసభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలకు పాల్పడ్డారు. తాజాగా హరీష్ మాట్లాడిన మాటలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు శుక్రవారం హరీశ్ రావు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు. తెలంగాణలో తమ ఆటలు సాగకూడదనుకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు హరీష్.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆరు హామీల్లో ఒక్క హామీ మాత్రమే అమలైందఐ చెప్పారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల కేటీఆర్ కూడా హైదరాబాద్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్