Site icon HashtagU Telugu

చోద్యం గురూ! బాబు ఎఫ్ 1- కేటీఆర్ ఈ1

విజ‌న్ 2020 త‌యారు చేయించిన చంద్ర‌బాబును విప‌క్ష నేత‌లు ఆనాడు పిచ్చోడ్ని చేశారు. ఫార్ములా వ‌న్ (ఎఫ్ 1) గురించి ఎప్పుడో 2003లో సీఎం హోదాలో చంద్ర‌బాబు తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. ఎఫ్1 వ‌ల‌న రైతుల‌కు ఏమి లాభం అంటూ అసెంబ్లీ వేదిక‌గా ఆనాడు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న వైఎస్ఆర్ నిల‌దీశాడు. రోడ్ల‌పై ఫ్లైవోవ‌ర్లు క‌డుతున్న చంద్ర‌బాబును తుగ్ల‌క్ గా అభివ‌ర్ణించాడు. రోడ్ల‌పై ఫ్లైవోవ‌ర్లు ఏంటి? అంటూ సామాన్యులు సైతం ముక్కున వేలేసుకునేలా విప‌క్ష నేత‌లు ప్ర‌చారం చేశారు. సీన్ క‌ట్ చేస్తే…20 ఏళ్ల త‌రువాత చంద్ర‌బాబు చేసిన ఆలోచ‌న ఇప్పుడు. బోధ‌ప‌డుతోంది.ఎప్పుడో 2003లో ఆనాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబునాయుడు ఫార్ములా వ‌న్ రేసింగ్ ను భార‌త‌దేశానికి తీసుకురావాల‌ని ఇటలీ వెళ్లాడు. ఆయ‌న విజ‌న్ ప్ర‌కారం అంతా జ‌రిగుంటే..2006లో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ రేసు హైదరాబాద్‌లో ఉండేది. అంతర్జాతీయ క్రీడా పటంలో హైద‌రాబాద్ కు చోటు ద‌క్కుతుంద‌ని బాబు ఇట‌లీ టూర్ సంద‌ర్భంగా హైప్ క్రియేట్ చేశాడు. ఇట‌లీలోని మోంజా గ్రాండ్ ప్రిక్స్‌ను సంద‌ర్శించి ఫార్ములా వన్ టాప్ బ్రాస్‌ల‌తో చంద్ర‌బాబు ఆనాడు చ‌ర్చ‌లు జ‌రిపాడు. ఫార్ములా వ‌న్ ఒకోసం నగర శివార్లలోని గచ్చిబౌలి సమీపంలో ట్రాక్‌ను ఏర్పాటు చేయడానికి వరుస ప్రోత్సాహకాలను కూడా అందించాడు. ఫార్ములా వన్ రింగ్‌మాస్టర్ బెర్నీ ఎక్లెస్టోన్ ఒకరు సమావేశమై హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పై చ‌ర్చించాడు.

ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ ప్రచార కార్యక్రమాలను మాదాపూర్‌లో నిర్వ‌హించారు. కర్టెన్ రైజర్‌లో భాగంగా ఫార్ములా-3 స్ట్రీట్ సర్క్యూట్ రేస్‌ను సిటీ ఐకానిక్ కేబుల్ బ్రిడ్ట్‌పై నుంచి ప్రారంభించారు. ఈ ఫార్ములా-3 కారును మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ చైర్మన్ పి.పి.రెడ్డి, ఎండీ క్రిష్ణారెడ్డి ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. ఫార్ములా వన్‌ తరహాలో ఇటీవల ఫేమస్‌ అయిన ఇ-వన్‌ ఛాంపియ్‌షిప్‌ని హోస్ట్‌ చేసేందుకు హైద‌రాబాద్ రెడీ అవుతోంది.ఎఫ్ 1 రేసింగ్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కార్పోరేట్‌ వరల్డ్‌లో ఈ పోటీల‌కు ఉన్న గుర్తుంపు ప్ర‌త్యేకం. ఒలంపిక్స్‌ తరహాలో ఆయా దేశాల్లోని నగరాలను ప్రమోట్‌ చేసుకునేందుకు ఎఫ్ 1 రేసింగ్స్‌ నిర్వహిస్తారు. ఇప్పుడు కాగా ఎలక్ట్రిక్‌ కార్ల వాడకానికి త‌గిన విధంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ తెర మీదకు వచ్చింది.
ఈ 1​ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ నగరాల్లో జ‌రిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్‌ నగరం ఆతిధ్యం ఇ‍చ్చేందుకు సిద్ధమవుతోంది.ఎఫ్ 1 రేసింగ్‌ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్‌ అవసరం. కానీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌తో నిర్వహించే పోటీలకు ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేదు. నగరంలో అందుబాటులో ఉన్న రోడ్లపై రేస్‌ నిర్వహించవచ్చు. ఇప్పటి వరకు ఇ రేసింగ్‌ ఛాపింయన్‌షిప్‌కి నెక్లస్‌రోడ్డు – ట్యాంక్‌బండ్‌ సర్క్యూట్‌, కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న సర్క్యూట్‌ రోడ్డు, గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లను పరిశీలనలోకి తీసుకున్నారు.ఈ1 ఫార్ములా రేస్ ల‌ను నిర్వహించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ చూపించారు… పలు దఫా చర్చల అనంతరం హైదరాబాద్‌ తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఫార్ములా ఇ అసోసియేషన్, తెలంగాణ, గ్రీన్‌కో సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఖరరానైట్టు అధికారి వర్గాలు వెల్లడించాయంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. తుది చర్చలు 2022 జనవరి 17న జరుగ‌బోతున్నాయి. రేసింగ్‌ పోటీలకు కార్పోరేట్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్లే విజయ్‌మాల్యా, ఆనంద్‌ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలు సొంతంగా ఎఫ్ 1 టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పోటీలకు కనుక ఆతిధ్యం ఇస్తే హైదరాబాద్‌ నగర బ్రాండ్‌ ఇమేజ్‌ ప్రపంచ పటంలో మరింతగా వెలిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ సూత్రాన్ని ఎప్పుడో 2003లో చెప్పిన చంద్ర‌బాబును పిచ్చోడ్ని చేసిన ఒక భాగం మీడియా, విప‌క్ష నేత‌లు ఇప్పుడు అలాంటి రేస్ లను ఫోక‌స్ చేస్తున్నారు. అంటే, బాబు చేస్తే త‌ప్పు ఇప్పుడు కేటీఆర్ చేస్తే ఒప్ప‌న్న‌మాట‌. ఇదే క‌లికాల‌మంటే.!