అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన మీడియా మొఘల్ , లెజెండ్ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు మరికాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగబోతున్నాయి. ఈ క్రమంలో రామోజీరావు నివాసం నుండి స్మృతివనం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. అంతే కాదు స్వయంగా రామోజీరావు పాడె మోశారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతిమసంస్కారాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సుజనాచౌదరి, చింతమనేని ప్రభాకర్, పట్టాభి, వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు, బిఆర్ఎస్ ఎంపీ లు ఎంపీలు కె.ఆర్.సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు.
ఇక రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. రామోజీరావు మరణ వార్త యావత్ ప్రజానీకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రధాని మోడీ దగ్గరి నుండి అనేక రాజకీయ పార్టీల అధినేతలు, రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు తమ సంతాపాన్ని తెలియజేసారు. అలాగే కడసారి ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు.
Read Also : Deepika Pilli : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి.. హీరో ఎవరంటే..?