Site icon HashtagU Telugu

BRS : నల్గొండ సభలో అపశృతి..హోంగార్డు మృతి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు గాయాలు

Brs Mla Injured In Road Acc

Brs Mla Injured In Road Acc

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో బిఆర్ఎస్ భారీ సభ (BRS Meeting In Nalgonda ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బిఆర్ఎస్ ఎంపీలు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు ఇలా అంత వెళ్లారు. కాగా ఈ సభ తర్వాత పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. ఈ సభకు వెళ్లే రోడ్లపై పోలీస్‌ సిబ్బంది ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్న సమయంలో చర్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి పోలీసులను ఢీ కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన హోంగార్డు కిశోర్‌ (HomeGuard Kishore) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో హోంగార్డుకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, పోలీస్‌ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన హోంగార్డును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదం (Road Accident)లో గాయపడ్డారు. నల్గొండలో బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా.. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు.

ఇక మరోచోట..బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ‘కేటీఆర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పలువురు కోడిగుడ్లతో వాహనాలపై దాడి చేశారు. దీంతో అక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అక్కడ్నుంచి ముందుకు కదిలారు.

Read Also : PM Modi: మోడీ అబుదాబి పర్యటన, రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు