Site icon HashtagU Telugu

Chain Snatching Gang : హైద‌రాబాద్‌లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్‌

Snatching

Snatching

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని తొమ్మిది మంది సభ్యులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుంచి 9 బంగారు గొలుసులు, మూడు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి రూ.6.3 లక్షల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని లొండే నగేష్, హెచ్ ధర్మేందర్, కమ్లే అనిల్, రురెన్షి రాహుల్, కాంబ్లే హీరా, కాంబ్లే లక్ష్మణ్, వొడ్డెర ప్రసాద్, వేముల శ్రీనివాస్, ఉపాధి రమేష్‌లుగా గుర్తించారు. వీరంతా మల్లేపల్లిలోని మంగర్ బస్తీ వాసులుగా పోలీసులు గుర్తించారు.

ముఠా సభ్యులు బస్టాప్‌ల వద్ద బంగారు గొలుసులు దొంగిలించేవార‌ని మాదాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ కె.శిల్పవల్లి తెలిపారు. నేరస్థులు బస్ స్టాప్‌ల వద్ద బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఉన్న ప్ర‌యాణికుల‌ను గుర్తించి వారిని బస్సుల్లో అనుస‌రించేవార‌ని తెలిపారు. బస్సుల్లో బంగారు గొలుసులు చోరీకి గురైన ఉదంతాల దృష్ట్యా మాదాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్ తిరుపతి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముఠా సభ్యులను పట్టుకున్నారు. నగేష్, ధర్మేందర్, లక్ష్మణ్‌లు గతంలో ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్నారని, వీరిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి నేరాలకు పాల్పడ్డారు