Central Government Funds : తెలంగాణ‌కు రూ. 2,102 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఏపీకి మాత్రం..

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించింది. దేశంలోని ప‌ద‌హారు రాష్ట్రాల‌కు మూల‌ధ‌నం పెట్టుబ‌డి కింద రూ. 56, 415 కోట్లు విడుద‌ల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Central Government Funds

Central Government Funds

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కేంద్రం నిధులు (Center funds) కేటాయించింది. దేశంలోని ప‌ద‌హారు రాష్ట్రాల‌కు మూల‌ధ‌నం పెట్టుబ‌డి కింద రూ. 56, 415 కోట్లు విడుద‌ల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Central Finance Department) ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణ‌కు రూ. 2,102 కోట్లు కేటాయించింది. 2023 – 24 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను స్పెష‌ల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫ‌ర్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్ మెంట్ పేరిట ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని కేంద్రం ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 1.3 ల‌క్ష‌ల కోట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. 50 ఏళ్ల‌కుగాను వ‌డ్డీ లేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాల‌కు అందుతుంది. అయితే, ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల‌కు మాత్రం కేంద్రం కేటాయింపులు ఏమీ చేయ‌లేదు. ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపిన నిధుల‌లో విద్య‌, వైద్యం, నీటి పారుద‌ల‌, మంచినీటి స‌ర‌ఫ‌రా విద్యుత్, ర‌హ‌దారులు వంటి వాటికోసం వినియోగించుకోవ‌చ్చు.

రాష్ట్రాల వారిగా కేటాయింపులు ఇలా..

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ (1255 కోట్లు), బీహార్ (9,640 కోట్లు), చ‌త్తీష్‌ఘ‌డ్ రాష్ట్రంకు (3195 కోట్లు), గోవా (386 కోట్లు), గుజ‌రాత్ (3478 కోట్లు), హ‌ర్యానా (1093 కోట్లు), హిమాచ‌ల్ ప్ర‌దేశ్ (826 కోట్లు), క‌ర్ణాట‌క రాష్ట్రంకు (3647 కోట్లు), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (7850), మిజోరాం (399), ఒడిషా (4528), రాజ‌స్థాన్ (6026), సిక్కిం (388), త‌మిళ‌నాడు (4079), తెలంగాణ రాష్ట్రం (2102 కోట్లు), వెస్ట్ బెంగాల్ ( 7523 కోట్లు) కేటాయింపులు చేసింది.

Etela Rajender: రేపు ఈట‌ల రాజేంద‌ర్ దంప‌తుల ప్రెస్‌మీట్‌.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేస్తారా?

  Last Updated: 26 Jun 2023, 09:33 PM IST