Site icon HashtagU Telugu

BJP : రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో కాంగ్రెస్‌ : కిషన్ రెడ్డి

Central Minister Kishan Reddy comments on congress

Central Minister Kishan Reddy comments on congress

Central Minister Kishan Reddy : సెంట్రల్ మినిస్టర్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఈరోజు పార్టీ స్టేట్ ఆఫీస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇదే మాదిరిగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలు తీశాయని అన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. సంస్థాగతంగా బీజేపీ బలోపేతం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ అప్పుల మీద అప్పులు తెస్తుంది. రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. దీనిపై మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి అని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తోంది, అంతకన్నా రెట్టింపు అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ గ్యారెంటీ ల గారడి ప్రజలు అర్ధం చేసుకు న్నారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి కావొస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఓ వైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై పోరాడాలన్నారు. దేశంలో జమ్ముకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన సాగుతోందన్నారు. కానీ బీజేపీలో మాత్రం కార్యకర్తల నుంచి ఉన్నతస్థాయి వరకు పదవులు దక్కుతాయన్నారు. కేసీఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు అయితే… కాంగ్రెస్ పాలనలోనూ అదే కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో తీర్పును ఇచ్చారని వెల్లడించారు.

Read Also: KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?