Site icon HashtagU Telugu

Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం

Ration Cards

Ration Cards

Ration Cards : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హులను తొలగించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అర్హత లేని వారిని గుర్తించి, వారి కార్డులను రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, ఆదాయపు పన్ను (Income Tax) చెల్లిస్తున్న కుటుంబాలు ఇకపై రేషన్ ప్రయోజనాలను పొందలేవని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలతో వేలాది కుటుంబాలు తమ రేషన్ కార్డులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ఆహార , ప్రజా పంపిణీ విభాగం (DFPD) ఆదాయపు పన్ను శాఖతో కలిసి పనిచేయనుంది. రేషన్ లబ్ధిదారుల ఆధార్ లేదా పాన్ వివరాలను డీఎఫ్‌పీడీ.. ఐటీ శాఖకు సమర్పించనుంది. ఐటీ శాఖ ఈ వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను, ఆదాయపు పన్ను చెల్లింపులను పరిశీలించి, అనర్హుల జాబితాను తిరిగి ఆహార శాఖకు అందించనుంది. ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా రేషన్ పొందుతున్న వారిని సులభంగా గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Earthquake: భూకంపాలకు అసలు కారణాలు ఇవే అంటున్న వాతావరణ నిపుణులు

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడానికి, వాహనం కొనడానికి లేదా ఇతర అవసరాలకు రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు రుణాలు ఇచ్చే ముందు వరుసగా మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను వివరాలను తప్పనిసరిగా పరిశీలిస్తున్నాయి. ఈ కారణంగా, ఆర్థికంగా వెనుకబడిన, మధ్యతరగతి కుటుంబాలు సైతం రుణాలు పొందడం కోసం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, రుణం కోసం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వేలాది కుటుంబాలు కూడా ఇప్పుడు అనర్హుల జాబితాలోకి వస్తాయి. దీంతో తెల్ల రేషన్ కార్డుతో పాటు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా వీరు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయంపై పేద, మధ్యతరగతి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణం కోసం తాము ఐటీ కడుతున్నామని, దానిని ఆదాయంగా పరిగణించి రేషన్ కార్డులు తొలగించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

India-US Trade : భారత్‌-అమెరికా మధ్య భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు..