BJP leaders security: కేంద్రం కీలక నిర్ణయం..ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ ఇద్దరు నేతలకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి.

Published By: HashtagU Telugu Desk
BJP leaders security

New Web Story Copy 2023 07 10t134917.147

BJP leaders security: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ ఇద్దరు నేతలకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి.

ఈట‌ల రాజేందర్‌కు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్రం కేటాయించింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈటలకు ‘వై ప్లస్‌’ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ఈటలపై కుట్ర జరుగుతుందన్న ఈటల, మరియు ఆయన భార్య జమున ఆరోపణలపై తెలంగాణ సర్కారు వెంటనే స్పందింది ఈ నిర్ణయం తీసుకుంది.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ లకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించడంతో ఇకపై వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించబడతాయి . ఈటలకు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ, ధర్మపురి అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.

Read More: Uniform Civil Code Worry : KCR కు పిత‌లాట‌కం

  Last Updated: 10 Jul 2023, 01:56 PM IST