Kaleshwaram : `కాళేశ్వ‌రం`పై విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి చ‌తికిల‌ప‌డింది. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు 1.15 కోట్లు దారిమల్లించి  మేఘ కంపెనీ ద్వారా నుండి కల్వకుంట్ల ఖాజనాకు పంపార‌ని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి, పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ ఆరోపించారు. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, పైనున్న అన్నారం పంపుహౌస్‌‌లు పూర్తిగా మునిగిపోయిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 05:06 PM IST

కాళేశ్వ‌రం ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి చ‌తికిల‌ప‌డింది. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు 1.15 కోట్లు దారిమల్లించి  మేఘ కంపెనీ ద్వారా నుండి కల్వకుంట్ల ఖాజనాకు పంపార‌ని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి, పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ ఆరోపించారు. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, పైనున్న అన్నారం పంపుహౌస్‌‌లు పూర్తిగా మునిగిపోయిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్‌‌ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, కంట్రోల్‌‌ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్‌‌ కండిషన్‌‌ సిస్టమ్​లు, రెండు స్కాడా సిస్టమ్​లు, సబ్‌‌ స్టేషన్లు గ‌ల్లంతు అయ్యాయ‌ని తెలిపారు. ఫ‌లితంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింద‌ని, డిజైన్, మెయింటనెన్స్​ లోపాలే ఈ న‌ష్టానికి కార‌ణ‌మ‌ని రిటైర్డ్​ ఇంజనీర్లు చెప్పిన విష‌యాన్ని ఉటంకించారు. కాళేశ్వ‌రంలోని అక్ర‌మాల‌పై గురువారం జ‌డ్స‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లోని ముఖ్యాంశాలివి.

1) 2019 ఆగస్టులో లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ ‌‌‌‌వాల్‌‌‌‌ ‌‌‌‌దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి.

2) అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 3న కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ దెబ్బతిని మోటార్లపైకి నీళ్లు చేరాయి. 3) మూడో టీఎంసీ పనులు చేస్తున్న టైంలోనూ ప్రొటెక్షన్‌‌‌‌ ‌‌‌‌వాల్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింది.

4) 2019 అక్టోబర్‌‌‌‌ 9న అన్నారం బ్యారేజీ గేట్లలో లీకేజీలు ఏర్పడ్డాయి.

5) 2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌ కూలింది.

5) మిడ్‌‌‌‌ మానేరు నింపడంలో ప్రొటోకాల్‌‌‌‌ పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్‌‌‌‌లో ఆ ప్రాజెక్టు కట్టకు బుంగ పడింది.

6) అన్నారం పంపుహౌస్‌‌‌‌ నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్‌‌‌‌ నిరుడు జులై 28న భారీ వర్షాలతో భూమిలోంచి పైకితేలింది.

7) నిరుడు సెప్టెంబర్‌‌‌‌ 27న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది.

8) కొండపోచమ్మసాగర్‌‌‌‌ లో నిర్మించిన వాకోవర్‌‌‌‌ బ్రిడ్జి 2020 ఆగస్టు 30న కూలిపోయింది.

9) అదే ఏడాది జులై 7న రంగనాయకసాగర్‌‌‌‌ డెలివరీ సిస్టర్న్‌‌‌‌ వద్ద రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ దెబ్బతింది.

10) ఇక్కడి నుంచి యాదాద్రి జిల్లాకు నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్‌‌‌‌ 2020 జూన్‌‌‌‌ 30న తెగింది.

11) అదే ఏడాది జూన్‌‌‌‌ 6న భారీ వర్షాలకు కొండపోచమ్మ పంపుహౌస్‌‌‌‌ కట్ట దెబ్బతింది.

13) 2020 జూన్‌‌‌‌ 13న మల్లన్నసాగర్‌‌‌‌ గ్రావిటీ కాల్వకు గండిపడి ఎర్రవల్లి గ్రామంలోని పంట భూములు నీట మునిగాయి.

14) ఎస్సారెస్పీకి భారీ వరద ముంచెత్తడంతో 2021 సెప్టెంబర్‌‌‌‌ 13న నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని పంపుహౌస్‌‌‌‌ మునిగిపోయింది.

15) ఇప్పుడు భారీ వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు మునిగిపోయాయి.

కాబట్టి కాళేశ్వరం భారీ ప్రాజెక్టు డిజైన్, మెయింటనెన్స్​ లోపాల వల్ల బాహుబలి మోటార్ల మునగడం పై మేఘ కన్స్ట్రక్షన్ పై చేసిన  ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ విచార‌ణ కోసం ప్రత్యేక జాయింట్ కమీషనర్  ఏ.కె.షిరివాస్తావ్ ను కేంద్రం నియమించింది.