Site icon HashtagU Telugu

CBN’s Gratitude Concert : అట్టహాసంగా ప్రారంభమైన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక

Cbn's Gratitude Concert

Cbn's Gratitude Concert

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration )లు ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది.

1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. హైటెక్ సిటీ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ వేడుకలు (CBN Gratitude Concert ) నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ కాన్సెర్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. కాన్సెర్ట్ కోసం తెలుగు ఐటీ ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసారు.

నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna), బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామ కృష్టమ రాజు (Raghuramakrishnam Raju), ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్, ఏబీ వెంకటేశ్వరరావు, బండ్ల గణేష్‌ (Bandla Ganesh), బీఆర్ఎస్ పార్టీ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బోయపాటి శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్‌ రూబెన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగుతోంది. సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

Read Also : Chandrababu : జైలు నుంచే చంద్రబాబు ఆట.. తెలంగాణలో మారిన రాజకీయం