Site icon HashtagU Telugu

Super Hit : 93 కులాల టీడీపీ! 119 చోట్ల పోటీ! ప్ర‌త్య‌ర్థుల్లో గుబులు!!

Super Hit

Babu

` కోల్పోయిన త‌రువాత దేని విలువైనా తెలుస్తుందని` ఆధ్యాత్మిక‌వేత్త‌లు అంటారు. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు విలువ మోజార్టీ ప్ర‌జ‌లు గుర్తించ‌లేక‌పోయారు. ఇప్పుడు ఆయ‌న విలువ ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది. అందుకు నిద‌ర్శ‌నం ఖ‌మ్మం వేదిక‌గా చంద్ర‌బాబు స‌భ‌కు హాజ‌రైన(Super Hit) జ‌న‌సందోహ‌మే. ఆ స‌భ‌ను చూసిన త‌రువాత ప్ర‌ధాన పార్టీల(opponents) గుండెల్లో రైళ్లు ప‌రుగెత్త‌డం స‌హ‌జం. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ లేద‌ని చంక‌లు గుద్దుకుంటోన్న వాళ్ల వెన్నులో చ‌లి మొదలైయింది.

ఖ‌మ్మం వేదిక‌గా చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు మేర‌కు పూర్వ‌పు లీడ‌ర్లు, క్యాడ‌ర్ క్యూ క‌ట్ట‌డం ఖాయం. పైగా 93 కులాల‌కు ప్ర‌తినిధిగా టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ క‌నిపిస్తున్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో బ‌డుగుల రాజ్యాధికారం దిశ‌గా ప‌య‌నించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అగ్ర‌కులాల కంటే బీసీలు త‌మ సొంత పార్టీగా భావిస్తుంటారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన త‌రువాత తెలంగాణ‌లోని బీసీల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. ప‌లువురు లీడ‌ర్ల‌ను ఆయ‌న త‌యారు చేశారు. పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటూ బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు.

ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్( Super Hit)

తెలంగాణ‌కు చేసిన నిస్వార్థ సేవకు నీరాజ‌నంగా చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ(Super Hit) క‌నిపించింది. ఆ వేదిక‌పై నుంచి పూర్వ వైభ‌వం కోసం ఆయ‌న శంఖారావాన్ని పూరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్( Super Hit) అయింది. దీంతో లీడ‌ర్లు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఇత‌ర పార్టీల‌కు వెళ్లిన లీడ‌ర్లు తిరిగి రావాల‌ని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తెలుగుదేశం బ‌లోపేతం అవుతుంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. పూర్వ వైభ‌వం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతూ తిరిగి అంద‌రూ రావాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం ఆలోచింప చేస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు 

భారీ ర్యాలీ సంద‌ర్భంగా ఖ‌మ్మం ప్ర‌జ‌లు మేడ‌లు ఎక్కి చంద్ర‌బాబుకు పూల‌వ‌ర్షం కురిపించారు. రెండు గంట‌ల‌పాటు ఖ‌మ్మం వీధుల్లో జ‌రిగిన ర్యాలీని వేలాది మంది జ‌నం అనుస‌రించారు. స‌భ‌కు ఇసేకేస్తే రాల‌నంత‌గా జ‌నం హాజ‌ర‌య్యారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు(opponents) ద‌డ ప‌డుతోంది. ఏ పార్టీ ఓట‌ర్ల‌ను టీడీపీ చీల్చుకుంటుంది? అనే అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచ‌ర‌గ‌ణం టీడీపీ వైపు చూస్తోంది. ఆ పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాలు రేవంత్ అనుచ‌రుల‌ను ఇబ్బంది పెడుతోంది. అందుకే, సొంత పార్టీగా ఉన్న టీడీపీలో చేర‌డానికి సిద్ధం అవుతున్నారు. ఇక బీజేపీ ద‌క్షిణ తెలంగాణ అంత‌టా బ‌ల‌ప‌డాలంటే తెలుగుదేశం పొత్తు అవ‌స‌ర‌మ‌ని భావించేలా ఖ‌మ్మం స‌భ జ‌రిగింది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాబోవు ఎన్నిక‌ల్లో కింగ్ మేక‌ర్ కానుంద‌ని ఆ స‌భ ద్వారా బోధ‌ప‌డుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయడానికి ప్ర‌ధాన పార్టీలో పోటీప‌డే అవ‌కాశం ఉంది. 2019 ఎన్నిక‌ల‌కు పూర్తి విరుద్ధంగా ఈసారి ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. రెండుసార్లు సెంటిమెంట్ తో సీఎం అయిన కేసీఆర్ ఈసారి బీఆర్ఎస్ రూపంలో వ‌స్తున్నారు. దీంతో తెలంగాణ ఎన్నిక‌ల క్షేత్రంలో తెలుగుదేశం పార్టీ హ‌వా కొన‌సాగుతుంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఖ‌మ్మం స‌భ తెలంగాణ రాజ‌కీయాల‌కు ఒక మైలురాయిగా మారింది.

Also Read : CBN ISB : ద‌టీజ్ చంద్ర‌బాబు విజ‌న్! నిస్వార్థ సేవ‌కు అరుదైన గౌర‌వం!