CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!

CBN Arrest Effect : బీఆర్ ఎస్ పార్టీ లో చంద్ర‌బాబు అనుకూల‌, వ్య‌తిరేక కూట‌ములుగా చీలిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 05:44 PM IST

CBN Arrest Effect : బీఆర్ ఎస్ పార్టీ లో చంద్ర‌బాబు అనుకూల‌, వ్య‌తిరేక కూట‌ములుగా చీలిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌ని న‌మ్మే కేసీఆర్ ఇప్పుడు ఏమి చేస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. తెలంగాణ ఎన్నిక‌ల మీద చంద్ర‌బాబు అరెస్ట్ ప్ర‌భావం క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. ఆయ‌న అరెస్ట్ ను ఖండించ‌క‌పోవ‌డం, క‌నీసం స్పందించ‌క‌పోవ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీన‌లోని కొంద‌రు నిల‌దీస్తున్నారు. మీడియాలో వాళ్ల అభిప్రాయాల‌ను వెలుబుచ్చుతున్నారు. మౌనంగ కేసీఆర్ ఉండే వ‌ర‌కు అరెస్ట్ వెనుక ప్ర‌మేయం ఉంద‌న్న భావ‌న క‌లుగుతుంద‌ని బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న బ‌య‌లు దేరింది.

బీఆర్ ఎస్ పార్టీలో చంద్ర‌బాబు అనుకూల‌, వ్య‌తిరేక కూట‌ములుగా (CBN Arrest Effect)

తెలంగాణ వ్యాప్తంగా కనీసం 40 స్థానాల్లో గెలుపు ఓట‌ముల‌ను నిర్దేశించే స్థాయిలో టీడీపీ ఉంది. ఆ విష‌యాన్ని ప‌లుమార్లు స‌ర్వేల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో సెటిల‌ర్లు మ‌ద్ధతు ఇచ్చిన డివిజ‌న్ల‌లో మాత్ర‌మే బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన చోట్ల ఎక్కువ‌గా బీజేపీ విజ‌యం సాధించింది. రాష్ట్ర విడిపోయిన త‌రువాత ఆంధ్రా ప్రాంతం నుంచి హైద‌రాబాద్ కు వ‌ల‌స‌లు త‌గ్గిపోయాయి. కానీ, ఉత్త‌ర భార‌త‌దేశం నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్ తో పాటు స‌రిహ‌ద్దుల్లోని ప్రాంతాల‌కు వ‌ల‌స వ‌చ్చిన విష‌యం బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఆంధ్రా సెటిల‌ర్ల కంటే ఇప్పుడు హైద‌రాబాద్ లో నార్త్ లాబీయింగ్ ఎక్కువ‌గా ఉంద‌ని నిఘా సంస్థ‌ల రిపోర్టు. కానీ, కేసీఆర్ ఇప్ప‌టికీ చంద్ర‌బాబు అరెస్ట్ ను ఖండించలేదు. దీంతో రాబోవు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి న‌ష్ట‌మ‌ని ఆ పార్టీలోని (CBN Arrest Effect) కొంద‌రు భావిస్తున్నారు.

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఏపీలోని ప‌రిస్థితుల‌పై

సాక్షాత్తు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఏపీలోని ప‌రిస్థితుల‌పై స్పందించారు. అక్ర‌మంగా చంద్ర‌బాబును అరెస్ట్ చేశార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యేలు కూడా చంద్ర‌బాబు అరెస్ట్ ను ఖండిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దుర్మార్గాన్ని వెలుగొత్తి చాటారు. టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని అభ్య‌ర్థులు మాత్రం చంద్ర‌బాబు ప‌ట్ల సానుభూతిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఓవ‌రాల్ గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప‌క్క రాష్ట్రం త‌ల‌పోటు మ‌నకెందుకు అంటూ త‌ప్పుకుంటోంది. ఈ ప‌రిణామం ఆ పార్టీని నిలువునా (CBN Arrest Effect) చీల్చేలా క‌నిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ లీడ‌ర్, ద‌ళిత బంధు అమ‌లు క‌మిటీ చైర్మ‌న్, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్ మీద ఎందుకు స్పందించ‌డంలేద‌ని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jagan Bail anniversary : న్యాయ‌దేవ‌త‌కు గంత‌లు! జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ కు ప‌దేళ్లు..!!

వాస్త‌వంగా టీడీపీ ప్ర‌తిరూపంగా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. ఫక్త్ రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని న‌డుపుతాన‌ని ప్ర‌క‌టించిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీలోని క్యాడ‌ర్, లీడ‌ర్ల‌ను కేసీఆర్ కుంజుకున్నారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన‌ప్ప‌టికీ దానిలోని లీడ‌ర్లు నూటికి నూరుశాతం పూర్వపు టీడీపీ వాళ్లే. సీఎం కేసీఆర్ తో స‌హా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన లీడ‌ర్లే. స‌మైక్య రాష్ట్రానికి మ‌ద్ధ‌తు ప‌లుకుతూ కేసీఆర్ పలు సంద‌ర్భాల్లో త‌న వాదాన్ని వినిపించిన ఆడియో, వీడియోలు అసెంబ్లీ లైబ్ర‌రీలో ప‌దిలంగా ఉన్నాయి. ఆయ‌న మాదిరిగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన వాళ్ల‌తో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒక‌నాడు చంద్ర‌బాబు నీడ‌న ఎదిగిన లీడ‌ర్లు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ల‌లోని కొంద‌రి మ‌న‌సు క‌రిగింది. చంద్ర‌బాబు అరెస్ట్ ను (CBN Arrest Effect) ఖండిస్తున్నారు.

Also Read : Countdown for Jagan : టీడీపీకి మంచిరోజులు.! జ‌గ‌న్ పై మోత్కుప‌ల్లి తిరుగుబాటు !!

రాబోవు రోజులు పార్టీ ప‌రంగా చంద్ర‌బాబు అరెస్ట్ మీద స్పందించ‌క‌పోతే, రాజ‌కీయంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆ పార్టీలో ఆందోళ‌న మొద‌ల‌యింది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ సానుభూతిప‌రులు ప్ర‌చారం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల తెర‌వెనుక మ‌ద్ధ‌తు కార‌ణంగా చంద్ర‌బాబును ఏపీ సీఎం అరెస్ట్ చేయించార‌ని పోస్టులు పెడుతున్నారు. వాటికి వస్తోన్న స్పంద‌న‌ను చూసిన బీఆర్ఎస్ లీడ‌ర్ల‌లో అల‌జ‌డిప్రారంభం అయింది. అంతేకాదు, ఐటీ సెక్టార్లోని ఉద్యోగులు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. వాళ్ల మీద పోలీసు కేసులు బ‌నాయించ‌డానికి కేసీఆర్ స‌ర్కార్ ముందుకొచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఐటీ ఉద్యోగులు, ఏపీ సెటిల‌ర్లు ఉన్నార‌ని గ్ర‌హించిన లీడ‌ర్లు హ‌డ‌లిపోతున్నారు. అందుకే, పోచారం, కృష్ణారావు, గాంధీ త‌దిత‌రులు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఇప్ప‌టికైనా స్పందించాల‌ని కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప‌రిణామం ముదిరితే, నిలువునా బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు.