Site icon HashtagU Telugu

Kavitha : నేటి నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

Cbi Will Interrogate Kavith

CBI will interrogate Kavitha from today

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను సీబీఐ(CBI) ఈరోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) సీబీఐకి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇంటరాగేషన్(Interrogation) ఈరోజు ప్రారంభం కానుంది. కవిత – బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు ఇచ్చిన వాంగ్మూలాలను చూపించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 15వ తేదీ వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవొచ్చు. మరోవైపు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్ ను కోర్టు అనుమతించింది. ఆప్ కు రూ. 100 కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్లు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండదని బెదిరించారని చెప్పింది.

Read Also: Janasena : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ..?

కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది.

Read Also: Poonam Kaur : పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్ ట్వీట్..?

ఐదు జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత నుంచి రూ. 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం జరిగిందని, ఇది ఆయనకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితులలో ఆయన చేశారని వివరించింది. భూమిని కొనుగోలు చేసినప్పటికీ భూ బదలాయింపు మాత్రం ఇప్పటికీ జరగలేదని తెలిపింది. అందులో భాగంగా జులై 2021లో రూ. 7 కోట్లు, నవంబరులో మిగిలిన రూ. 7 కోట్లు కవితకు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్టు ఆధారాలు లభించాయని కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు కూడా సీఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి రూ. 80 లక్షలు బదిలీ చేసినట్టు పేర్కొంది.