Site icon HashtagU Telugu

Scam: రేవంత్ స్కామ్స్ పై CBI విచారించాలి – RS ప్రవీణ్

Rs Praveen Revanth

Rs Praveen Revanth

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen) తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి బిఆర్ఎస్ ను, అది సాధించిన విజయాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు వేల కోట్ల రూపాయల స్కామ్‌లకు పాల్పడ్డారని, వారిపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల రిపేర్ ఖర్చు కేవలం రూ. 15 కోట్లు మాత్రమేనని, కానీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక భారీ కుంభకోణంగా చిత్రీకరిస్తోందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ విచారణలను చేపడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోయేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన ఆరోపించారు.

Kavitha Next Target : కవిత నెక్స్ట్ టార్గెట్ అతడేనా..?

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు పలు స్కామ్‌లలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, వాటిపై విచారణ చేపట్టడానికి సిబిఐని అడగాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం నిజంగా ఆందోళన చెందుతుంటే, ముందుగా రేవంత్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలని ఆయన అన్నారు.

మొత్తంగా… కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అనేది రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమని బిఆర్ఎస్ వాదిస్తోంది. ఈ విచారణను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నిజాయితీగా ఉంటే, రేవంత్ రెడ్డి అవినీతిపై కూడా విచారణ జరపాలని వారు సవాల్ విసిరారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.