MLC Kavitha: 11న సిద్ధంగా ఉండండి.. కవిత కు సీబీఐ సమాధానం!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది.

  • Written By:
  • Updated On - December 6, 2022 / 05:45 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత (MLC Kavitha) తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సీబీఐ అంగీకరించింది. వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సీబీఐకి కవిత (MLC Kavitha) లేఖ రాసిన విషయం విధితమే. కవిత లేఖకు సీబీఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్ లో కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ (CBI) తెలిపింది.

అయితే కవిత ఇంటికే సీబీఐ వెళ్లడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. అయితే సెక్షన్ CRPC 160 ప్రకారం సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థ ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి విచారించే అవకాశం ఉంటుంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మహిళా అయితే ఈ సెక్షన్ ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. బాధితురాలి చెప్పిన ప్రదేశంలోనే విచారణ చేపట్టవచ్చునని ఈ సెక్షన్ చెబుతోంది.