Site icon HashtagU Telugu

CBI Notice to Kavitha : లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు

Cbi Notice To Kavitha

Cbi Notice To Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)కు మరోసారి నోటీసులు (Notice) జారీ అయ్యాయి. ఫిబ్రవరి 26న తప్పకుండా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది. గతంలోనే కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత ఇంకా స్పందించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఈడీ (ED) విచారణకు హాజరు కానీ కవిత.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరు అవుతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ కవిత ఈడీ, సీబీఐ నోటీసులు ఇవ్వడం బిఆర్ఎస్ శ్రేణులతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : TDP : రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ – అంబటి సెటైర్