Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసును సవరించి ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు సూచించారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను మూడుసార్లు ప్రశ్నించారు. కవితకు నాలుగోసారి సమన్లు జారీ కాగా , విచారణకు హాజరు కాకుండా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు .
మద్యం కుంభకోణంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఫిబ్రవరి 28న విచారణ జరగనుంది. కవితకు ఇచ్చిన నోటీసును సవరించి నిందితురాలిగా చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అయితే కవిత నిందితురా లేక నిర్దోషినా అనే విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో కవిత నోటీసుల మేరకు సీబీఐ విచారణకు వెళుతుందా..లేక సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది.
మద్యం కేసులో కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు కవిత కూడా అరెస్ట్ కానున్నారని జాతీయస్థాయిలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలనుంది. వచ్చే లోకసభ ఎన్నికల్లో కవిత ప్రభావం గట్టిగానే పడనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
Also Read:CM Revanth : HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక