CBI : KCR మెడ‌కు ఫామ్ హౌస్ కేసు! 2014 నుంచి ప్ర‌జాప్ర‌తినిధులపై ఎర ఇష్యూ!

టైమ్ బాగ‌లేక‌పోతే క‌ర్ర కూడా పామై క‌రుస్తుంద‌ని పెద్ద‌ల సామెత‌. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్(CBI) ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.

  • Written By:
  • Updated On - February 9, 2023 / 03:36 PM IST

టైమ్ బాగ‌లేక‌పోతే క‌ర్ర కూడా పామై క‌రుస్తుంద‌ని పెద్ద‌ల సామెత‌. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్(CBI) ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల(MLA)ఎర కేసును మునుగోడు ఎన్నిక‌ల వేళ బ‌య‌ట‌కు తీసుకుకొచ్చారు. బీజేపీ పార్టీని ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు బ‌ద్నాం చేయ‌గ‌లిగారు. తెలంగాణ పోలీసు అధికారుల‌తో సిట్ ను ఏర్పాటు చేసిన హడావుడి సృష్టించారు. కానీ, ఆ కేసులో ఒక్క రూపాయిని కూడా బ‌య‌ట పెట్ట‌లేక‌పోయారు. ఫామ్ హౌస్ కేంద్రంగా సాగిన వీడియోలు, ఆడియోల‌ను మాత్రం దేశ వ్యాప్తం చేయ‌గ‌లిగారు. ప్ర‌తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ ప్ర‌భుత్వం మీద న‌మోదు అయింది.

ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల ఎర కేసును..(CBI)

ఇప్పుడు ఎమ్మెల్యేల ఎర కేసు సిట్ నుంచి సీబీఐకి(CBI) మారింది. తెలంగాణ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డాన్ని సుప్రీం కోర్టులోనూ కేసీఆర్ స‌ర్కార్ స‌వాల్ చేసింది. కానీ, హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ సుప్రీం కూడా డైరెక్ష‌న్ ఇవ్వ‌డంతో కేసీఆర్ వ్య‌వ‌హారం కుడితిలో ప‌డ్డ ఎలుకలా మారింది. ఇప్పుడు ఆ కేసును. సీబీఐ విచార‌ణ సాగిస్తే స‌రికొత్త వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని బీజేపీ చెబుతోంది. మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా కేసీఆర్ వేసిన డ్రామా మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆశిస్తోంది. దానికి అద‌నంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి సీబీఐకి లేఖ రాస్తూ కేసీఆర్ గ‌తంలో తీసుకున్న ఎమ్మెల్యేలు,(MLA) ఎంపీలు, ఎమ్మెల్సీల వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆ మేర‌కు డీజీపీకి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్

తెలంగాణ సీఎం కేసీఆర్ 2014 నుంచి 2018 వరకు 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు,(MLA) 18 మంది ఎమ్మెల్సీ లను వివిధ పార్టీ ల నుంచి టిఆర్ఎస్ లోకి తీసుకున్నారు. 2018 లో ఎన్నికలు ముగిసిన త‌రువాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకున్నారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు లు నేరాలకు అలవాటు పడ్డ వారుగా గుర్తింపు పొందారు. వాళ్ల‌లో 3 ఎమ్మెల్యేలు మొయినాబాద్ కేంద్రంగా బీజేపీలోకి మరెందుకు జరిగిన వ్యవహారంలో ఉన్నారు. అందుకే, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా జ‌రిగిన ఎమ్మెల్యేల ఎర కేసు ను సీబీఐకి(CBI) ఇస్తోన్న క్ర‌మంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్ ను కూడా జత చేసి సీబీఐ.కి ఇవ్వాలని పీసీసీ డిమాండ్ చేస్తోంది.

Also Read : KCR-KTR : తండ్రి జాతీయవాదం,త‌న‌యుడి ప్రాంతీయ‌వాదం,`క‌ల్వ‌కుంట్ల` మాయ‌

ఎమ్మెల్యేల కొనుగోలు కు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఆర్.ఐ కేసు నెంబర్ 455 లో కాంగ్రెస్ నుంచి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల (MLA)వ్య‌వ‌హారంపై ఇచ్చిన‌ ఫిర్యాదు ను కూడా జత చేయాల‌ని రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. అంతేకాదు, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 వరకు 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీ లను వివిధ పార్టీ ల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీట‌న్నింటి మీద సీబీఐ విచార‌ణ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అంతేకాదు, తెలుగుదేశం తెలంగాణ విభాగం కూడా కేసీఆర్ స‌ర్కార్ మీద ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధ‌మైయింది.

కేసీఆర్ స‌ర్కార్ మీద ఫిర్యాదు

ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ ను ప్ర‌క‌టించిన త‌రువాత ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను అనేక మందిని కేసీఆర్ ఆక‌ర్షించారు. ఇత‌ర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేల‌ను(MLA) ప్ర‌లోభ పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌కు ల‌బ్ది చేకూర్చారు. ఆయ‌న సీఎం అయిన త‌రువాత నుంచి ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోలు అంశాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని సీబీఐని ప్ర‌త్య‌ర్థి పార్టీలు కోరుతున్నాయి. ఒక వేళ సీబీఐ క‌నుక మొయినాబాద్ కేసుతో పాటు 2014 నుంచి కేసీఆర్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు తీస్తే ప‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్పుడు కేసీఆర్ కుర్చీ కింద‌కు నీళ్లు వ‌స్తాయ‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. మొత్తం మీద కేసీఆర్ చేసిన ఆప‌రేష‌న్ తిరిగి ఆయ‌న‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది. ఇదే టైమ్ బాగ‌లేక‌పోతే క‌ర్ర కూడా పామై క‌రుస్తుందంటే.!

Also Read : Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!