రేవంత్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే (Caste census Survey) ను చేపడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి ఈ సర్వే ను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. ఈ సర్వేలో ఆస్తులు, ప్రభుత్వం నుండి తీసుకుంటున్న పథకాల గురించి చెపితే తమకు వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఆ వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయో కూడా చెప్పడం లేదు. కారు , బైక్, వాషింగ్ మిషన్ , ఏసీ తదితర వస్తువులు , వాహనాలు ఉన్నప్పటికీ వాటి గురించి చెప్పడం లేదు. ఎక్కడ ఇవన్నీ ఉంటె ఫ్రీ కరెంట్ తీసేస్తారో..రైతు బీమా వంటివి తొలగిస్తారో అనే భయం తో ఏమి లేవనే అంటున్నారు.
ప్రభుత్వం కూడా వాటిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఏమి చెపితే ఏంజరుగుతుందో అని ప్రజలు భయంతో సర్వే కు వచ్చిన వారికీ ఆ వివరాలు చెప్పడం లేదు. కొంతమందతే ఆధార్ వివరాలు ఇచ్చేందుకు కూడా ఖంగారుపడుతున్నారు. అసలు ఈ సర్వే దేనికి అని ..? దీని వల్ల ఏ ఉపయోగం ఉంది..? ప్రజలకు ఏ మేలు జరుగుతుంది..? ప్రభుత్వం ఈ సర్వే తో ఏంచేయబోతుందో..? వంటివి కూడా క్లారిటీ లేకపోవడం తో ఈ సర్వే పట్ల ప్రజలు అయోమయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వమైతే సమగ్ర కులగణన సర్వేను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తుండగా, ఇప్పటివరకూ 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.16కోట్ల ఇళ్లను గుర్తించగా, ఇప్పటివరకూ 67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 87.1%, నల్గొండలో 81.4%, జనసాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో కేవలం 38.3% పూర్తయింది.
Read Also : TTD : నేడు టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం