కేంద్రం కులగణన(Caste Survey)పై కీలక నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)స్పందించారు. దేశ ప్రజల గుండెచప్పుడు విన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi), జోడో యాత్రలో కులగణన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయన సూచనల మేరకు తెలంగాణలో మొదటిసారిగా సమగ్ర కులగణన చేపట్టామని పేర్కొన్నారు. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిదని, ఇది సామాజిక న్యాయం సాధనలో ముఖ్యమైన అడుగు అని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
May Day : మీ రెక్కల కష్టం.. మీ త్యాగం వెలకట్టలేనిది: కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన విధివిధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి, జనగణనలో కులగణన జరపాలని, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం ఎత్తివేయాలంటూ కేంద్రానికి సూచించినట్టు వివరించారు. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టిన నేపథ్యం, కేంద్రంపై వేసిన ఒత్తిడి వల్లే ప్రధాని మోదీ కులగణనపై ముందడుగు వేసినట్టు వెల్లడించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలని, రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రులు, ఎంపీలు, బీసీ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నా, వారి అసూయ స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి రోల్ మోడల్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యమని, రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేయడంలో కేంద్రానికి సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.