EX Minister Mallareddy : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు

  • Written By:
  • Updated On - December 13, 2023 / 01:59 PM IST

 

బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు చేసారు గిరిజనులు. మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గిరిజనులకు సంబదించిన 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్టేషన్ చేసారని..మల్లారెడ్డి తో పాటు రిజిస్టేషన్ చేసిన రిజిస్టర్ ఫై కూడా గిరిజనలు కేసు పెట్టారు.

చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసారని, కుట్రతో మోసగించి భూమిని కాజేసారని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన షామీర్ పేట పోలీసులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో పాటు మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి , కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త సహా మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.

బాధితుడు కేతావత్ బిక్షపతి నాయక్ వారసత్వంగా వచ్చిన భూమి ఆరుగురిపై ఉందన్నారు. ఈ భూమిపై కన్నేసిన మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి హరిమోహన్ రెడ్డి , మధుకర్ రెడ్డి , శివుడు , స్నేహరామిరెడ్డి రామిలి, లక్ష్మమ్మ , రామిడి నేహా రెడ్డిలు మాకు మాయ మాటలు చెప్పి కుట్రతో మమ్మల్ని నమ్మించి మీ భూమి మీకు వస్తుందని ఆశ చూపి మమ్మల్ని నమ్మించి అబద్ధాలు చెప్పి నిరక్ష్య రాస్యులైన మాతో రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడ్డారన్నారు. ఆరోజు మాకు ఏడు మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చారన్నారు. మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు శామీర్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమినీ మల్లారెడ్డి అనుచరులపై రిజిస్టర్ చేశారని వారు ఆరోపించారు.

Read Also : Parliament : పార్లమెంట్ లో భద్రత వైఫల్యం ..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతుకులు