KCR National Politics : కేసీఆర్ జాతీయ ఎజెండాపై ప‌రోక్ష ఫైట్

జాతీయ ఎజెండాను కేసీఆర్ ప్ర‌కటించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ పార్టీ వెట‌ర‌న్ లీడ‌ర్ మాజీ కేంద్ర మంత్రి ఏ.కే ఆంటోనీ ప‌రోక్షంగా కౌంట‌ర్ వేశారు.

  • Written By:
  • Updated On - April 28, 2022 / 02:12 PM IST

జాతీయ ఎజెండాను కేసీఆర్ ప్ర‌కటించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ పార్టీ వెట‌ర‌న్ లీడ‌ర్ మాజీ కేంద్ర మంత్రి ఏ.కే ఆంటోనీ ప‌రోక్షంగా కౌంట‌ర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశ రాజ‌కీయాల‌ను మార్పు చేయ‌డం ఎవ‌రి త‌రం కాద‌ని టీఆర్ఎస్ చీఫ్ పేరు ఎత్త‌కుండా చుర‌క‌లించారు. నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ లేద‌ని, అలాగే కాంగ్రెస్ లేకుండా మ‌రో ప్ర‌త్యామ్నాయం దేశంలో అసాధ్య‌మ‌ని ఆంటోని తేల్చేశారు. అందుకే, మోడీ స‌ర్కార్‌కు ప్ర‌త్యామ్నాయం కోసం కాంగ్రెస్ తో కల‌సి రావాల‌ని కేసీఆర్ కు ఇండైరెక్ట్ గా పిలుపునిచ్చారు.

2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ గెలుపు అవకాశాల గురించి ఆంటోనీ ఆశావ‌హంగా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోందని వెల్ల‌డించారు. కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయవద్దని టీఆర్ఎస్ లాంటి పార్టీల‌కు సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ మరియు ఇతర చోట్ల మత హింసల నేపథ్యంలో చాలా బాధాకరంగా ఉందన్నారు ఆంటోనీ. అన్ని మతాలు, అన్ని కులాలు, వివిధ భాషలు కలిసి ఏకైక దేశం భారతదేశం అన్నారు. భారతదేశానికి ప్రధాన బలం భిన్నత్వంలో ఏకత్వంకు బదులుగా విద్వేషం ఉంద‌ని ఆరోపించారు.”నెహ్రూ-గాంధీ కుటుంబం నాయకత్వం వహించకుండా కాంగ్రెస్ ఉనికిలో లేదు. కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమికి కూడా భారత రాజకీయాల్లో ఎటువంటి స్థానం ఉండదు. 2024లో ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ ప్రధాన పాత్రను మిగిలిన పార్టీల వారు అంగీకరించాలి. కాంగ్రెస్‌ను లేకుండా కేంద్రంలో అధికారంలోకి రావ‌చ్చ‌ని భావిస్తే వారు కలల ప్రపంచంలో జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను“ అంటూ కేసీఆర్ ఎజెండాను టార్గెట్ చేశారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ “చింతన్ శివిర్”లో చర్చలు, మేధోమథనం తర్వాత ఒక ప్రణాళికను రూపొందించడం ద్వారా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ బలమైన శ‌క్తిగా ఎదిగేలా చేస్తామ‌ని చెప్పారు. “2024లో మార్పు తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే, ఏ కూటమిలోనైనా కాంగ్రెస్‌ను లీడింగ్‌ రోల్‌లో చేర్చుకుని దానితో వెళ్లాలి. దేశవ్యాప్తంగా బీజేపీని మినహాయించి ఉన్న ఏకైక జాతీయ పార్టీ ఇదే. కాంగ్రెస్‌ను తప్పించడం వల్ల మీరు ఎలాంటి మార్పు తీసుకురాలేరు” అని కేరళ మాజీ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఎజెండాపై గురిపెట్టారు.