తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Elections Results) వచ్చేసాయి..పూర్తి స్థాయిలో కాంగ్రెస్ విజయ డంఖా మోగించింది..హ్యాట్రిక్ కొట్టాలని చూసిన కేసీఆర్ కలలపై ప్రజలు నీళ్లు చల్లారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలకు ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైం గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడుతున్న అభ్యర్థులను చూస్తే..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంబం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌లో కుందూరు జైవీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామెల్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. అనీల్ కుమార్ రెడ్డి మినహా కొత్త అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలోకి దింపి సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ కొత్తవారికి ఛాన్స్ ఇచ్చి విజయం సాధిస్తే..బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చి బొక్క బోర్లాపడింది.