TET Last date : త్వరగా అప్లై చేయండి.. సమీపించిన “టెట్‌” లాస్ట్ డేట్

TET Last date : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)  పరీక్ష  లాస్ట్ డేట్ సమీపించింది. ఇంకా అప్లై చేయనివారు  రేపటి (ఆగస్టు 16) వరకు అప్లై  చేసుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
TS TET 2023

Tet Notification

TET Last date : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)  పరీక్ష  లాస్ట్ డేట్ సమీపించింది. ఇంకా అప్లై చేయనివారు  రేపటి (ఆగస్టు 16) వరకు అప్లై  చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.400. ఈసారి టెట్ కు కాంపిటీషన్ చాలా పెరిగింది. ఆగస్టు 14 సాయంత్రం నాటికి 2,23,811 మంది అప్లై చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ‘టెట్’ పరీక్షను నిర్వహించనున్నారు.సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదలవుతాయి.  టెట్-2023కు సంబంధించి పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు అర్హులు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తో పాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే ఛాన్స్ ఉంది.  ప్రస్తుతం డీఈడీ, బీఈడీ చివ‌రి ఏడాది చ‌దువుతున్నవారు కూడా టెట్(TET Last date)  రాయడానికి అర్హులే.

Also read : Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు

గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్ 

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also read : BCCI Selectors: నంబర్-4లో ఎవరికి అవకాశం..? సెలెక్టర్లు ముందు పలు అంశాలు..!

  Last Updated: 15 Aug 2023, 01:13 PM IST