Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 06:39 AM IST

Group-1 Prilims: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘2022 ప్రిలిమ్స్ కటాఫ్ కు 25 మార్కులు ఎక్కువ వచ్చాయి. లీకేజీతో ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేశారు. జూన్ లో మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించారు. ఇప్పుడు రద్దు చేశారు. సమయం, డబ్బు వృథా. ఎగ్జామ్ పెట్టడం చేతకాక పోతే వేలం పాట వేసుకోండి. మనవి కాని డబ్బు మనం ఖర్చు చేస్తున్నాం అని మనసులో ఏదో వెలితి’ అని ఓ నిరుద్యోగి బాధపడ్డాడు.

2015లో అయిపోయింది. 6 నెలల గ్యాప్ లో జీరో నుండి స్టార్ట్ చేస్తే గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది. 2016 నుండి గ్రూప్ 1 మీద కూర్చుంటే నోటిఫికేషన్ లేదు. 2019 లో APPSC రాసా.. ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యాయ్ క్లియర్.. ఇంటర్వ్యూ gone. 2022లో TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే అప్పటి నుండి దీని మీదే ఉన్నా.. అక్టోబర్ లో ప్రిలిమ్స్ కటాఫ్ కి 25 మార్క్స్ ఎక్కువ వచ్చాయ్.
February లో మెయిన్స్ అన్నారు.. ఈలోపు గ్రూప్ 2 postpone చేయాలి అని గొడవ చేస్తే నవంబర్ కి postpone చేసారు.. గ్రూప్ 1 మెయిన్స్ అదే నెలలో పెట్టడం కుదరదు. సరే ఇంకో రెండు నెలలు మహా అయితే అనుకున్నా.. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ అన్నారు.. మూడో సారి రాయాలి.. ఇంటి మొహం చూడక ఏడాదిన్నర.. సమయం. డబ్బు.. వృధా. అది చాలక మెంటల్ టార్చర్.. Exams పెట్టడం చేతకాక పోతే వేలం పాట వేసుకోండి.. డబ్బులున్న వాడు కొనుక్కుంటారు.. మాలాంటి వాళ్ళం దాని జోలికే రామ్ కదా.. నెల నెలా కూర్చుని తింటూ ఉంటే అన్నం సహించడం లేదు.. రెంటు బుక్స్ test series లు అంటూ అదనపు ఖర్చులు అని తన గోడును వెళ్లబోసుకున్నాడు ఓ నిరుద్యోగి.

Also Read: Female Grooming: ఆఫీసులకు వెళ్లే మహిళలు ఇవి తప్పకుండ పాటించండి

ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను హైకోర్టు రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని (TSPSC) ఆదేశించింది. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదని, హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్వహణా సంస్థను ఆదేశించింది. పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌-1 పరీక్ష ఓసారి రద్దయిన విషయం తెలిసిందే.