Bullock Cart : హైదరాబాద్ సిటీ రోడ్లపై ఎడ్ల బండ్లు.. ట్రాఫిక్ కొత్త రూల్స్ ఇవీ

Bullock Cart : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 09:02 AM IST

Bullock Cart : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  హైదరాబాద్‌ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలను రద్దు చేయడంతో పాటు అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలను కేటాయించారు. సిటీలో ఉన్న మొత్తం రోడ్లను 91 రకాల రూట్లుగా విభజించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన వాణిజ్య వాహనాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంపై బ్యాన్ విధించారు. లోకల్‌ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే అనుమతి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

కొత్త రూల్స్ ఇలా.. 

  • డీసీఎం వంటి మధ్య తరహా గూడ్స్‌ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువున్నవి) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే హైదరాబాద్‌లో తిరగాలి.
  • ప్రైవేటు బస్సులు కేవలం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యే ప్రయాణించాలి.
  • అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బండ్లు, జంతువులు లాగే బండ్లు, సైకిల్‌ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 మార్గాల్లో నిషేధించారు.
  • ఎడ్ల బండి (Bullock Cart) కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది.హైదరాబాద్‌లో ఎడ్లబండ్లు తిరగొచ్చు. కానీ కొన్ని రూట్లలో మాత్రం వాటిని నిషేధించారు.
  • నగరంలోని ఆ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే.. తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ రూల్స్‌ను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • 2 నుంచి 6 టన్నుల బరువున్న భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలు హైదరాబాద్ నగరంలో ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు..  రా త్రి 10 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య మాత్రమే సంచరించాలి.
  • 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన భవన నిర్మాణ వ్యర్థాల వాహనాలకు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే హైదరాబాద్ నగరంలోకి  అనుమతి ఉంటుంది.