Site icon HashtagU Telugu

BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయే అని ఫిక్స్ అవ్వొచ్చా..?

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ (BJP Chief) ఎవరు అనే అంశం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పలువురు పేర్లు మొన్నటి వరకు ప్రచారం జరిగిన..ప్రస్తుతం బండి సంజయ్ (bandi Sanjay) కే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, తెలంగాణపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెబుతున్నారు. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ పార్టీని బలంగా నిలబెట్టారు. అప్పట్లో బీజేపీ అట్టడుగున ఉండగా, ఆయన నాయకత్వంలోనే పార్టీ గట్టిగా ఎదిగింది.

Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేయమని..

మళ్లీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తే, తనదైన పోరాట శైలితో బీజేపీని దూకుడుగా నడిపించగలరనే అభిప్రాయం బలంగా ఉంది. బీసీ వర్గానికి చెందిన ఆయన, ప్రజల్లో సానుభూతిని పొందగల నాయకుడు. ప్రత్యేకంగా, బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగల లీడర్‌గా గుర్తింపు పొందారు. కిషన్ రెడ్డి పూర్తిగా కేంద్ర రాజకీయాల్లో మునిగిపోనున్న నేపథ్యంలో, బీజేపీకి ఒక గట్టి నాయకుడు అవసరమనే అభిప్రాయం ఉంది.

ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. కానీ, హైకమాండ్ ఈసారి పూర్తిగా ప్రాధాన్యతను బండి సంజయ్‌కు ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.