Site icon HashtagU Telugu

Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి

Seetharam Naik

Seetharam Naik

Seetharam Naik : ఎన్నికల టైం దగ్గరపడే కొద్దీ తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల కీలక నేతలను తమ వైపు లాక్కొని.. అభ్యర్థులుగా వారి పేర్లను అనౌన్స్ చేస్తోంది. ఇప్పటికే  నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌‌లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఈ లిస్టులో మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరబోతున్నారు ? ఆయన ఎవరు అనుకుంటున్నారా ? మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ !! తాజాగా ఆయనతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హనుమకొండలోని సీతారాం నివాసానికి వెళ్లి కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అంశంపై ఆయనతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటానని కిషన్ రెడ్డికి సీతారాం నాయక్ (Seetharam Naik) చెప్పినట్లు సమాచారం.ఈనేపథ్యంలో త్వరలోనే సీతారాం నాయక్ పార్టీ మారే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని సీతారాం నాయక్ భావించారు. కానీ కేసీఆర్ మళ్లీ వద్దిరాజు రవిచంద్రకే ఛాన్స్ ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో ఆయన జంప్ అవుతారనే ప్రచారం జరుగుతున్న టైంలో కిషన్ రెడ్డితో భేటీ కావడం గమనార్హం. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో సీతయ్య, హుస్సేన్ నాయక్ పేర్లను పరిశీలిస్తోంది. ఒకవేళ మరింత బలమైన నేత దొరికితే టికెట్ ఇవ్వాలని కమలదళం భావిస్తోంది. ఇందులో భాగంగానే సీతారాం నాయక్‌ను బీజేపీ సంప్రదించిందని అంటున్నారు. బీజేపీ ప్రపోజల్‌ను సీతారాం నాయక్ ఏ కోణంలో చూస్తారు ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనేది వేచిచూడాలి.

Also Read : YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్

సీతారాం నాయక్ ట్రాక్ రికార్డ్

Also Read :Health tips: బిర్యానీ ఆకుతో ఇలా చెస్తే.. షుగర్ మాయం అవ్వాల్సిందే?