Site icon HashtagU Telugu

Federal Front : కేసీఆర్ కు ‘దీదీ’ ఫోన్

Mamata Kcr

Mamata Kcr

కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయ‌డానికి దూకుడుగా వెళుతోన్న బెంగాల్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసింది. సామాజిక న్యాయం, ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ కోసం పోరాటం చేస్తోన్న త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కు కూడా ఆమె ఫోన్ చేసి మాట్లాడింది. ఆ విష‌యాన్ని బెంగాల్ సీఎం మ‌మ‌త కార్యాల‌యం ధ్రువీక‌రించింది. సోమ‌వారం ఇద్ద‌రు సీఎంల‌తోనూ మ‌మ‌త మంత‌నాలు సాగించింది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి దేశంలో సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవాలని, సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని కోరింది. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలోకి దిగలేదని తెలిపింది. విస్తృత ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మమత చెప్పారు. మార్చి 3న వారణాసిలో టీఎంసీ భారీ ర్యాలీ చేపట్టనుందని మమత చెప్పార‌ట. కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేదని, దానికి తనదైన బాట ఉందని కేసీఆర్ కు వివ‌రించింద‌ని తెలిసింది. టీఎంసీ కూడా ఫెడ‌ర‌ల్ స్పూర్తితో వెళ్తుందని కేసీఆర్ తో చెప్పార‌ట‌. ఫెడరల్ ఫ్రంట్‌కు సహకారం అవసరమని కేసీఆర్ ను కోరింద‌ని తెలిసింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో మాట్లాడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం తెలిపారు. మొత్తం మీద మ‌మ‌త దూకుడు పెరిగింది. కేసీఆర్, స్టాలిన్ కంటే మ‌మ‌త ముందుగా వేగం పెంచింది. ప్ర‌ధాని పీఠంపై ఆమె గురి పెట్టింది.