DSC Protest : సచివాలయం ముట్టడికి పిలుపు.. నిరుద్యోగుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్లో రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Tg Secretariat

Tg Secretariat

తెలంగాణ డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్లో రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారు రోడ్లపైకి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాలతో పాటు అక్కడికి వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. సచివాలయం ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు నిరుద్యోగులు. న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళనలను కొనసాగిస్తామని నిరుద్యోగ యువత అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ నిరసనలను ఉధృతం చేస్తున్నారు. అయితే.. నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయం ముట్టడిని అడ్డుకునేందుకు నిరుద్యోగులను, నిరుద్యోగ నాయకులను అరెస్ట్‌, హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.

అయితే.. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు. అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను జల్లడ పట్టి అరెస్ట్ చేస్తున్నారు. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లోని అన్ని బుక్‌స్టోర్స్‌, టీ స్టాళ్లను మూసివేయించిన పోలీసులు… అశోక్‌నగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా 144 సెక్షన్‌ను అమలుకు పూనుకున్నారు. ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెంట్రల్‌ ల్రైబ్రరీ వద్ద గస్తీ తిరుగుతున్నారు పోలీసులు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా పికెట్లు ఏర్పాటు చేసి, సెక్రటేరియట్‌కు వచ్చే మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు కొన్ని చోట్ల చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. సామాన్య ప్రజలు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఇటు ఈ చెక్‌పోస్ట్‌లతో పాటు కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతు ఆఫీసలుకు వెళ్లాల్సి వస్తోంది.

Read Also : Whatsapp Update: త్వరలో వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై ట్రాన్స్లేషన్ మరింత ఈజీ!

  Last Updated: 15 Jul 2024, 11:29 AM IST