CAG Report on Hyderabad Metro Rail : ఒప్పందాన్ని తుంగలో తొక్కిన హైదరాబాద్ మెట్రో..ఎంత దారుణం ..!!

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 03:31 PM IST

హైదరాబాద్ (Hyderabad) లో మెట్రో (Metro) రాకముందు ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. సిటీ బస్సులు , MMTS ట్రైన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయేవి. ముఖ్యంగా హైటేక్ సిటీ సైడ్ వెళ్లాలంటే తల ప్రాణం తోకొచ్చేది. కానీ మెట్రో (Hyderabad Metro Rail) వచ్చాక సిటీ లో ట్రాఫిక్ కాస్త తగ్గింది. అయినప్పటికీ సిటీ లో ఓ చోట నుండి మరో చోటకు వెళ్లాలంటే గంటల సమయం పడుతుందనుకోండి. ఇదిలా ఉంటె తాజాగా కాంగ్ నివేదిక హైదరాబాద్ మెట్రో లో జరిగిన భారీ మోసాన్ని బయటపెట్టింది. ముందుగా మెట్రో సంస్థ.. కనీస టికెట్ ధర మూడు రూపాయలు. రూ. 40 చెల్లిస్తే చాలు ఒక్క రోజులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ప్రయాణం చేయొచ్చు.. అని ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుందట. కానీ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయానికి కనీస టికెట్ ధరే రూ.40 కి చేరినట్లు కాగ్ (CAG) ఆడిట్ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా టికెట్ ధరలను అధికంగా నిర్ణయించారని కాగ్ తెలిపింది. దీని మూలంగా 2017 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ప్రయాణికుల దగ్గర్నుంచి అదనంగా రూ.213.77 కోట్లు వసూలు చేసిందని కాగ్ తెలిపింది. ఇక కారిడార్ -3లో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సక్రమంగా తయారు చేయకపోవడంతో అంచనా వ్యయం రూ.1232 కోట్లకు పెరిగిందని , ఒప్పందానికి విరుద్ధంగా విస్తీర్ణం తగ్గించి మెట్రో స్టేషన్లను నిర్మించడంతో మెట్రో సంస్థకు రూ.227.19 కోట్ల లబ్ధికి చేకూరిందని కాగ్ తెలిపింది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కోసం 25 చోట్ల 57 ఎకరాలను అప్పగిస్తే.. 11 ప్రాంతాల్లో 33 ఎకరాల్లో మాత్రమే పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు కాగ్ వివరించింది. ఇక మెట్రో రైలుకు కేటాయించిన భూముల్లో నిర్మించిన మాల్స్ మెట్రో రైలు సేవలు ప్రారంభించిన తర్వాతే అద్దెకు లేదా లీజుకు ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ మెట్రో రైలు మొదలు కాక ముందే వాటిని లీజుకు ఇచ్చేశారు. దీంతో మెట్రో నిర్మాణ సంస్థకు లాభం కలిగిందని పేర్కొంది. ఇలా ఓవరాల్ గా మెట్రో ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొంది.

Read Also : Chandrababu : రాజశ్యామలయాగం చేస్తున్న చంద్రబాబు