Site icon HashtagU Telugu

TS : నేడు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటి

Notifications

Notifications

Cabinet Meeting: ముఖమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు(శనివారం) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ సమావేశం(Cabinet meeting) జరుగనుంది. ఈ భేటిలో ప్రధానంగా ఏపి, తెలంగాణ మధ్య పెండింగ్‌ మరియు జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

జూన్ 2 తరువాత హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగుల బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులతో సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read Also: Yarapathineni Srinivasa Rao : వైసీపీ నేతలపై ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

కాగా, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందున… అవసరమైన నిధుల సమీకరణకు ఆదాయ వనరులపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.