TRS: ఎమ్మెల్యేల కొనుగోలు ఉత్తుతిదేనా… ఇదంతా కేసీఆర్ వ్యూహమా?… టీఆర్ఎస్ మౌనం వెనక కారణమేంటీ..!!

  • Written By:
  • Updated On - October 28, 2022 / 12:35 PM IST

మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఉపఎన్నిక మరికొద్దిరోజుల్లోనే జరగనున్న నేపథ్యంలో… ఈ వ్యవహారం ఏ పార్టీకి ప్లస్ కానుంది..? ఏ పార్టీకి మైనస్ కానుంది. ఈ అంశంపై ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును ఓ డ్రామాగా కొట్టిపారేసింది బీజేపీ. దీంతో టీఆర్ఎస్ పై దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ పై దండెత్తారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులపై తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలంటూ కోర్టును కోరారు.

బీజేపీ ఈ స్థాయిలో దూకుడుగా వ్యవహారిస్తుంటే టీఆర్ఎస్ మాత్రం మిన్నకుండి పోయింది. ఏం పట్టనట్లు వ్యవహారిస్తోంది. ఒకరిద్దరు నేతలు తప్పా… ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారమంతా కూడా విచారణ దశలో ఉందని టీఆర్ఎస్ నేతలు ఎవరూ మాట్లాడకూడదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో ఈ అంశం గురించి పెద్దగా మాట్లాడవద్దన్న నిర్ణయానికి టీఆర్ఎస్ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Also Read:   Janasena: ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం..!

అయితే బీజేపీ దూకుడగా వ్యవహరిస్తుంటే…అధికారపార్టీ ఎందుకు ఎదురు దాడి చేయడం లేదన్నది ఆసక్తిరేపుతోంది. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందని..అందుకే ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది పార్టీ నాయకత్వం అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ అంశంపై ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు మాట్లాడతారన్న ప్రచారం వచ్చింది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడతారన్న ప్రచారం జోరుగానే సాగింది. కానీ కేసీఆర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ మీడియా ముందుకు రాలేదు. దీంతో అసలు టీఆర్ ఎస్ వ్యూహాం ఏంటి.? ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఉత్తితిదేనా… ఇదంతా కేసీఆర్ డ్రామానా అనే సందేహాలు మొదలయ్యాయి.

నిజంగానే ఎమ్మెల్యేలను మభ్యపెట్టింది బీజేపీ అయితే…రెడ్ హ్యాండ్ గా పట్టించిన టీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. బీజేపీ దూకుడుగా వ్యవహారిస్తుంటే చూస్తూ ఎందుకు ఉంటుందనే అంశం తెరపైకి వచ్చింది. విచారణ పూర్తయ్యాక టీఆర్ఎస్ స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏపార్టీకి అనుకూలంగా ఉంటుందన్నది ఉపఎన్నిక ఫలితాల తర్వాతే తేలుతుంది. ప్రజలు అధికార పార్టీ వైపు ఉంటారా..? కమలానికి జై కొడతారా ? ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి హస్తం పార్టీని హత్తుకుంటారా?

Also Read:   Gujarat : గుజరాత్ లో టాటా సహకారంతో 22వేల కోట్ల ఎయిర్ బస్ ప్రాజెక్టు..!!